విద్యార్థులకు ఓర్పు సహనం అవసరం-ఎస్సై నాగకార్తీక్

ఎలమంచిలి (జన హృదయం): స్థానిక స్టేషన్ రోడ్డు లో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇటీవలే స్టూడెంట్ పోలీస్ క్యాడేట్ స్కూల్ గా ఎంపికైన నేపథ్యంలో స్థానిక టౌన్ ఎస్సై పాఠశాలను సందర్శించి పాఠశాలలో పర్యావరణ పరిరక్షణ బాగుందని అభినందించారు. ఈ సందర్భంగా ఎస్సై నాగకార్తీక్ విద్యార్థులతో మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో విద్యార్థులకు ఓర్పు సహనం అనేవి చాలా ముఖ్యమైనవి అని ఈ రెండింటిని ఎక్కువగా పెంపొందించుకుంటే ఎంతటి ఉన్నత శిఖరాలను అయినా అధిరోహించవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో డిటిసి ఎస్సై రామం,పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి.వి.వి.ఎస్.సాయిబాబా మరియు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.


Comments

Popular posts from this blog

కొత్త జిల్లాలను ప్రారంభించిన సీఎం జగన్‌

ఘనంగా ప్రారంభమైన అల్లూరి సీతారామరాజు జిల్లా