ఐక్యమత్యంతో రాజకీయ ప్రాధాన్యత సాధించాలి
అప్పికొండ బీచ్ (జన హృదయం): నాయిబ్రాహ్మణుల అంతా సంఘటితంగా ముందుకు సాగి గుర్తింపు తెచ్చుకోవాలని నాయి బ్రాహ్మణ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉండవల్లి శ్రీనివాస రావు పిలుపునిచ్చారు. సద్గురు త్యాగరాజు ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విశాఖపట్నం అప్పికొండ బీచ్ లో నిర్వహించిన వన భోజన కార్యక్రమం లో కమ్యూనిటీని అభివృద్ధి చేసుకోవడంలో భాగంగా నాయి బ్రాహ్మణ సంఘ నాయకులు మాట్లాడుతూ నాయిబ్రాహ్మణుల అంతా ఐక్యమత్యంతో ఒక తాటి పైకి రావాలని కోరారు వృత్తిపనివారు కూడా కుల వివక్షకు గురవుతున్నామన్న ఆలోచన విడనాడి కమ్యూనిటీని సగర్వంగా చెప్పుకునే విధంగా అభివృద్ధి చెందాలని కోరారు ఇటీవల బిగ్ బాస్ షోలో రాహుల్ సిప్లిగంజ్ అనే నాయి బ్రాహ్మణ వ్యక్తి గర్వంగా తన కమ్యూనిటీని షోలో చెప్పుకోవడం జరిగిందని దీంతో అందరూ ఆయనకు మద్దతు పలికారని అందరి మద్దతు కూడగట్టుకొని సిప్లిగంజ్ ఓ పెద్ద సెలబ్రిటీ గా ఎదిగారని అన్నారు దీనికి దీటుగా ప్రతి ఒక్కరూ నడుం బిగించి కమ్యూనిటీ ఐక్యం చేయడం లో పాలు పంచుకోవాలని కోరారు సభ్యులంతా కలిసి ఏకతాటిపై చేరిననాడు రాజకీయ ప్రాధాన్యత లభిస్తుందని దానిద్వారా నాయి బ్రాహ్మణుల కు గుర్తింపు వచ్చి కమ్యూనిటీ అన్ని రంగాల్లోని అభివృద్ధి చెందుతుందని వక్తలు అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో నాయి బ్రాహ్మణ సంఘ నాయకులు ఆరిపాక పెంటారావు కనకరాజు సుబ్బారావు రవిచంద్ర, నరసింహమూర్తి తదితర నాయకులు పాల్గొని ప్రసంగించారు ఈ కార్యక్రమానికి విశాఖ జిల్లాకు చెందిన నాయి బ్రాహ్మణ కుటుంబాలకు చెందిన సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు
Comments
Post a Comment