వై.యస్.ఆర్. నవశకం సర్వేలో ఎంపిడిఓ, మున్సిపల్ అధికారులదే బాధ్యత.. కలెక్టర్ విజయ్ చంద్


• నిర్లక్ష్యం వహించి జిల్లాకు చెడ్డ పేరు తీసుకురావద్దు

• సర్వే డేటా ప్రతీ రోజు కంప్యూటర్ లో నమోదు చేయాలి

• ఈ నెల 20 నుండే వై.యస్.ఆర్. నవశకం సర్వే ప్రారంభం

• ముందుగానే గృహ యజమానులకు సర్వే గూర్చి సమాచారం ఇవ్వాలి

వైయస్ఆర్ నవశకం శిక్షణా తరగతుల్లో వెల్లడించిన కలెక్టర్ వినయ్ చంద్

విశాఖపట్నం (జనహృదయం): సర్వే గూర్చి ముందుగానే గృహ యజమానులకు సమాచారం ఇవ్వాలని జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్ పేర్కొన్నారు. జిల్లా స్థాయి రిసోర్స్ పర్సన్, ఎంపిడిఓలు, మున్సిపల్ అధికారులకు వై.యస్.ఆర్. నవశకం శిక్షణా తరగతుల కార్యక్రమం ఉడా చిల్డ్రన్ ఎరీనాలో నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న నవరత్నాల్లో భాగంగా వై.యస్.ఆర్. నవశకం సర్వేలో ఎంపిడిఓ, మున్సిపల్ అధికారులదే పూర్తి బాధ్యతని, ఏ మాత్రం నిర్లక్ష్యం వహించి, జిల్లాకు చెడ్డపేరు తీసుకురావద్దని ఆయన తెలిపారు. వైయస్ఆర్ నవశకం  పథకాలకు లబ్దిదారుల ఎంపికను ఈ నెల 20వ తేదీ నుండి  గ్రామ/వార్డు వాలంటీర్లు ఇంటింట సర్వే ప్రారంభించి  ప్రతీరోజు డేటా ఎంట్రీ చేయాలని ఎంపిడిఓలు, మున్సపల్ అధికారులను ఆదేశించారు.  ప్రతీ ఇంటికీ గ్రామ వాలంటీర్లు వెళ్లి సర్వే చేసి నిజమైన లబ్దిదారులను ఎంపిక చేయాలన్నారు.  రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన పథకాలలో భాగంగా  4 కార్డులు రైస్ కార్డు, పెన్షన్ కార్డు, ఆరోగ్య శ్రీ కార్డు, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన తో పాటు 7 రకాల పథకాలకు సంబంధించి  వైయస్ఆర్ మత్యకార భరోసా, నేతన్న నేస్తం, 0 వడ్డీ, జగనన్న అమ్మఒడి, టైలర్లు, రజకులు, నాయీబ్రాహ్మణులు, వైయస్ఆర్ కాపు నేస్తం, ఇమామ్, మౌజం, అర్చకులు, పాస్టర్లు లకు సంబంధించి సర్వే చేయువలసి ఉంటుందని చెప్పారు.  18, 19 తేదీలలో వాలంటీర్లకు శిక్షణ ఇవ్వాలని, 20 వ తేదీ నుండి సర్వే ప్రారంభించాలని తెలిపారు.  ఈ కార్యక్రమం నవంబరు 30 నాటికి పూర్తి చేయాలని, డిశంబరు 2వ తేది నాటికి అనర్హల జాబితాను తయారు చేసి 8వ తేదిన పూర్తి లబ్దిదారుల జాబితాను సచివాలయాల్లో ప్రదర్శించాలన్నారు.  10 నుండి 14 తేదీలలో గ్రామ సభలను పెట్టి అభ్యంతరాలు స్వీకరించాలని పేర్కొన్నారు.  18, 19 తేదీలలో కార్డుల ప్రింటింగ్ చేసి 20వ తేదీ నుండి కార్డుల పంపిణీ చేయాలన్నారు.  ఈ విధంగా డిశంబరు నెలాఖరు లోగా వైయస్ఆర్ నవశకంనకు సంబంధంచి లబ్దిదారుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేయాలన్నారు.  సర్వే ప్రక్రియ పూర్తి అయ్యే వరకు సంబంధిత అధికారులు, వాలంటీర్లకు ఏ విధమైన సెలవులు మంజూరు చేయవద్దని ఆదేశించారు.  ప్రతి ఒక్కరూ అంకిత భావంతో పనిచేసి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని చెప్పారు.  ఎంపిడిఓలు, మున్సిపల్ కమీషనర్లు ప్రభుత్వ పథకాలకు సంబంధించిన గైడ్ లైన్స్ ను పూర్తి అవగాహనతో ఉంటూ ఈ కార్యక్రమాన్ని మోనిటరింగ్ చేయాలన్నారు. ప్రతి ఎంపిడిఓ సచివాలయాల వారీగ సర్వే షెడ్యూల్ పంపాలన్నారు.  ఏ విధమైన అపోహాలకు తావుండకూడదని తెలిపారు.  మనం చేసిన తప్పుల వలన లబ్దిదారులు నష్టపోకూదని చెప్పారు.   జివియంసి కమీషనర్ డా. జి. సృజన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు నవంబరు 20వ తేదీ నుండి డిశంబరు 20వ తేదీనాటికి లబ్దిదారులను ఎంపిక జాబితాను తయారు చేసి కార్డుల పంపిణీకి సిద్దంగా ఉండాలన్నారు.  ప్రతి వాలంటీర్ ఏ రోజు చేసిన సర్వే ఆ రోజు డేటాను కంప్యూటర్ లో నమోదు చేయాలని చెప్పారు.  డేటా ఎంట్రీలో నర్లక్ష్యం వహించవద్దని తెలిపారు.  టెరిటోరియల్ మ్యాపింగ్ సరిగా చేసుకోవాలన్నారు.  అనంతరం  ఆయా శాఖలకు సంబంధించిన అధికారులు పథకాల గైడ్ లైన్స్ గూర్చి వివరించారు. ఈ సమావేశంలో ఐటిడిఎ పిఓ డికె బాలాజి,  సబ్ కలెక్టర్ వెంకటేష్, శిక్షణ కలెక్టర్ ప్రతిష్ట, డిఆర్డిఎ పిడి విశ్వేశ్వరరావు, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఉప సంచాలకులు తనూజ రాణి, సాంఘిక సంక్షేమ శాఖ డిడి జయప్రకాష్,  డిఇఓ లింగేశ్వర రెడ్డి, సర్వశిక్ష అభియాన్ పిఒ మళ్లిఖార్జునరావు, తదితరులు పాల్గొన్నారు.  శిక్షణకు నియోజక వర్గాల ప్రత్యేక అధికారులు, మండల ప్రత్యేక అధికారులు, ఆర్డిఓలు, మున్సిపల్ అధికారులు, ఎంపిడిఓలు, రిసోర్స్ పర్సన్స్, తదితరులు హాజరైనారు.

Comments

Popular posts from this blog

కొత్త జిల్లాలను ప్రారంభించిన సీఎం జగన్‌

ఘనంగా ప్రారంభమైన అల్లూరి సీతారామరాజు జిల్లా