అంతర్జాతీయ సమ్మేళనానికి సిద్దమౌతున్న రవీంద్రభారతి విద్యార్దులు
నేషనల్ ఏరోనాటిక్స్ మరియు స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (నాసా) లో దక్షిణ భారతావని లోనే ప్రప్రథమంగా 2009 వ సంవత్సరం లో మొదలైన రవీంద్రభారతి విద్యాసంస్థల ప్రస్థానం గత 10 సంవత్సరాలుగా, రవీంద్రభారతి విద్యాసంస్థల ప్రణాళికా రచన, విధివిధానాలు, క్రమశిక్షణలనే ఆయుధాలు గా మలచి ప్రతీ సంవత్సరము విజయబావుటా ఎగురవేస్తూ రవీంద్రభారతి కి సాటి-ఏ సంస్ధ కాదు పోటీ అంటూ వివిధ అంశాలలో విజయదుందుభి మోగిస్తున్న ఏకైక విద్యా సంస్థ రవీంద్రభారతి మాత్రమే అని పాఠశాల యాజమాన్యం ఒక ప్రకటనలో తెలియజేసింది. ప్రతీ సంవత్సరము వలె ఈ విద్యా సంవత్సరము నకు కూడా డల్లాస్, టెక్సాస్ లో 2020 వ సంవత్సరము మే నెల 28 నుండి 31 తేదీల వరకు జరిగే అంతర్జాతీయ సమ్మేళనము నకు రవీంద్రభారతి విద్యార్థులు నూతన ఉత్సాహముతో, ఉత్తేజముతో, ఉత్సుకతతో వివిధ శాఖలలో, వివిధ అంశాలలో ప్రాజెక్టుల తయారీకి సంసిద్ధమయ్యారు.రవీంద్రభారతి విద్యాసంస్థల చైర్మన్ ఎం.యస్.మణి విద్యార్థులను ప్రోత్సహిస్తూ,విజేతలై, జగజేతలై పోటీలో నిలవాలని ఆకాంక్షిస్తూ, ఆశీర్వదిస్తూ వారికి శుభ వచనాలను,సూచనలను తెలియజేసారు. ఇలాంటి మరెన్నో విజయాలను సాధించి రవీంద్రభారతి విద్యాసంస్థల కీర్తిప్రతిష్టలను మరింత ఇనుమడింప జేసేలా విద్యార్ధులందరు తయారుకావాలని పలువురు ఆకాంక్షిస్తూ, వారి ఆశీర్వచనాలు అందజేశారు. జోనల్ ఇంచార్జి శ్రీన్. వెంకటేశ్ గారు,నార్త్ ఆంద్రా . ఎం. శ్రీమతి(జి. ర్.వసంతగారు విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు.ద్వారాకనగర్ ప్రధానాచార్యులు శ్రీమతి లలితా బాలి గారు.డీన్ శ్రీమతి టి. శ్రీదేవిగారు విద్యార్థులకు ఆశీస్సులు ఇస్తూ. శుభం భూయత్ అన్నారు.
Comments
Post a Comment