మెరుగైన విద్య కోసం నవోదయ విద్యాలయలం వోపిన్ చేయాలి
సీలేరు /గూడెంకొత్తవీధి నవంబర్. 13. (జన హృదయం)
సీలేరు విశాఖ పట్నం జిల్లా లో 2వ నవోదయ విద్యాలయ సమితి పాఠశాల చింతపల్లిలో ఏర్పాటు చేయడానికి ప్రభుత్వ డైరీ ఫాం వద్ద గల ప్రభుత్వ భూమి 30 ఎకరాలను సబ్ కలెక్టర్, పాడేరు వారు చూపించారు. కలెక్టర్ & జిల్లా మేజిస్ట్రేట్, విశాఖ పట్నం వారు డెప్యూటీ కమీషనర్, నవోదయ విద్యాలయ సమితి, ప్రాంతీయ కార్యాలయం వారికి ఈ విషయం తెలియపరుస్తూ
నివేదిక పంపారు.ప్రాంతీయ కార్యాలయం ,నవోదయ విద్యాలయ సమితి వారు ప్రిన్సిపల్,నవోదయ విద్యాలయ సమితి, విశాఖపట్నం వారికి
లేఖ వ్రాస్తూ నవోదయ విద్యాలయ సమితి విధి విధానాల ప్రకారం ప్రభుత్వ భూమిని ఎటువంటి ధర,లీజు చెల్లించకుండా పొందేలా కలెక్టర్ & జిల్లా మేజిస్ట్రేట్, విశాఖపట్నం వారిని కోరమని ఆదేశిస్తూ లేఖ వ్రాసారు.విశాఖపట్నం జిల్లా మన్య ప్రాంతానికి 2015-16 సంవత్సరాల లో మంజూరైన పాఠశాలను వీలైనంత త్వరగా చింతపల్లి మండలంలో ఏర్పాటు చేస్తే గిరిజన విద్యార్ధినీ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు అవకాశం ఉంటుంది. వచ్చే విద్యాసంవత్సరం నుంచైనా తాత్కాలిక భవనాలలో ఈ పాఠశాలను చింతపల్లిలో ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని గడుతూరి రామ గోపాల్, అధ్యక్షుడు, భారతీయ ఆదివాసుల సమాఖ్య, ఆంధ్రప్రదేశ్ కోరారు.
Comments
Post a Comment