సర్వే వివరాలు కంప్యూటరీకరణ చేయాలి
విశాఖపట్నం (జనహృదయం): నవశకం సర్వే వివరాలు కంప్యూటరీకరణకు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్ ఆదేశించారు. బుధవారం సర్క్యూట్ హౌస్ లో నవశకం పథకాలకు సంబంధించి సర్వే చేసిన డేటా పై ఆయన అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి నుండి చేపడుతున్న నవశకం పథకాలకు సర్వే వివరాలు ఎప్పటికప్పుడు కంప్యూటరీకరణ చేసి ప్రింటింగ్ చేసి గ్రామాల వారీగా వేరు చేసి సంబంధిత గ్రామాలు/వార్డులకు పంపాలన్నారు. కంప్యూటర్లు సిద్దం చేసుకొని, వాటికి ఇంటర్ నెట్ సౌకర్యం వంటి వాటిని ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎల్. శివ శంకర్, జివియంసి కమీషనర్ డా.జి. సృజన, జిల్లా పరిషత్ సిఇఓ రమణమూర్తి, డిఆర్డిఎ పిడి విశ్వేశ్వరరావు, సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు జయ ప్రకాష్, జిల్లా విద్యా శాఖాధికారి లింగేశ్వర్ రెడ్డి, యుసిడి పిడి శ్రీనివాసరావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి తిరుపతిరావు, తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment