మీడియా స్వేచ్ఛను హరించే జీవోను రద్దు చేయాలి
మీడియా స్వేచ్ఛను హరించే జీవోలను రద్దు చేయాలి
కాకినాడ కలెక్టరేట్ ఎదుట ఎపిడబ్ల్యుజెఎఫ్ ధర్నా
జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం అందజేత
కాకినాడ (జన హృదయం): మీడియా స్వేచ్ఛకు భంగం కలిగించేలా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 2430, 938 జీవోలను తక్షణమే ఉపసంహరించుకోవాలని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ( ఎపిడబ్ల్యుజెఎఫ్ ) తూర్పుగోదావరి జిల్లా శాఖ డిమాండ్ చేసింది. బుధవారం కాకినాడ కలెక్టరేట్ ఎదుట జిల్లా నుండి భారీగా తరలివచ్చిన జర్నలిస్టులతో ధర్నా చేపట్టారు. రాస్తారోకో నిర్వహించి పత్రిక స్వేచ్ఛను కాపాడాలంటూ నినాదాలు చేశారు. అనంతరం ర్యాలీ గా బయల్దేరి జిల్లా కలెక్టర్ ఎం. మురళీధర్ రెడ్డికి ఫెడరేషన్ బృందం వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఎపిడబ్ల్యుజెఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వాతాడ నవీన్ రాజు, జిల్లా అధ్యక్షులు అల్లుమల్లు ఏలియా, జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ సలీం మాట్లాడుతూ ప్రజస్వామ్య వ్యవస్థలో రాజ్యాంగానికి విరుద్ధంగా మీడియా స్వేచ్చను హరించే ధోరణిలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2430, 938 జీవోలు ఉన్నాయన్నారు. మీడియా గొంతు నొక్కే జీవోలను తక్షణమే ఉపసంహరించుకోవాలని లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పాత్రికేయులు ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ సలీం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు షేక్ మున్నీ, హరి, ఏపిబిజేఎ కార్యదర్శి బంగర్రాజు, ఫెడరేషన్ జిల్లా కోశాధికారి వల్లూరి నానాజీ, జిల్లా జాయింట్ సెక్రటరీ వి.రవికుమార్, జిల్లా ప్రచార కార్యదర్శి కర్రి ధర్మరాజు, కాకినాడ సిటి అధ్యక్షుడు శ్రీధర్, కార్యదర్శి గోపి, ఫెడరేషన్ నాయకులు వంశీ, సూర్యనారాయణ, జెడి శ్రీనివాస్, షేక్ ఉస్మాన్ బాషా, రాజవొమ్మంగి ధర్మరాజు, సుదర్శన్, వుండ్రు సత్యనారాయణ, షేక్. వల్లీ, బింధాని సురేష్, రమేష్, సుకుమార్, పసలపూడి పండు తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment