తప్పిన పెను ప్రమాదం
ప్లాష్.... ప్లాష్
విశాఖ జిల్లా నర్సీపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్ లో భారీ ప్రమాదం తప్పింది. ఇక్కడ పారిసిల్ ఆఫీస్ పక్కన గల జూస్ పాయింట్ ను ఆనుకొని ఉన్న భారీ వృక్షం విరిగి పడడంతో అప్పుడే బస్ దిగిన స్టూడెంట్స్ భయబ్రాంతులకు గురైన ప్రయాణికులు పరుగులు పెట్టారు.కొంతమంది స్టూడెంట్స్ పడిపోవడంతో షాప్ వద్ద ఉన్న ప్రయాణికులు వారి ని కాపాడారు.గతంలో కూడా ఇక్కడ ఉన్న ఫోటో స్టూడియో పై కూడా చెట్టు పడిపోవడంతో కొన్ని బైక్ లు ద్వంశమైయ్యాయి. అప్పట్లో విద్యుత్ సరఫరా లేకపోవడంతో భారీ ప్రమాదం తప్పింది.ఈ ప్రాంగణంలో తరచూ ప్రమాదాలు సంభవిస్తాన్నా డిఎం పవన్ కుమార్ కు తెలిపినా పట్టించుకోకుండా ఉన్నారని,షాప్ యజమానులు, ప్రయాణికులు,విద్యార్థులు వాపోతున్నారు. అధికారులు ఇప్పటికయినా స్పందించి ప్రమాదకరమైన చెట్టలను తొలగించి రక్షణ కల్పించాలని కోరుతున్నారు.
Comments
Post a Comment