రెండునెలల్లో మత్స్యకారుల సమస్యలు పరిష్కారం: ఎమ్మెల్యే గొల్ల బాబురావు
ఎస్ రాయవరం (జనహృదయం): మత్స్యకారుల సమస్యలు రెండు నెలల్లో పరిష్కరిస్తానని పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్లబాబూరావు హామీ ఇవ్వడంతో మత్స్యకారులు ధర్నా విరమించారు.శనివారం మధ్యాహ్నం బంగారమ్మపాలెం ధర్నా ప్రాంతానికి వెళ్ళిన ఆయన మత్స్యకారులనుద్దేశించి మాట్లాడారు.37 రోజులుగా మీరు చేస్తున్న పోరాటం న్యాయమైనదన్నారు. మీ డిమాండ్ల పరిష్కారానికి జిల్లా కలెక్టరు, నేవల్ అధికారులతో నిరంతరం చర్చించి రెండు నెలల్లోపు పరిష్కరిస్తానని, తన తల్లిదండ్రుల మీద ప్రమాణంచేశారు.ఇది తన బాధ్యత అని మీ సమస్య పరిష్కారం ఎమ్మెల్యేగా నాబాధ్యత అయినందున తరచు అధికారులతో మీ సమస్యల పురోగతిపై సమీక్ష చేస్తానని హామీ ఇవ్వడంతో మత్స్యకారులు ధీక్షలు విరమించినట్లు ప్రకటించారు.ఈయన వెంట తహశీల్ధారు వేణుగోపాల్ ,సిఐ విజయ్ కుమార్ , నాయకులు మదువర్మ, మాజీఎంపిటిసి మైలపల్లి రాజారావు మత్స్యకారుల నాయకులు పాల్గొన్నారు.
Comments
Post a Comment