పెరిగిన పెట్రోల్ ధరలు
పెరిగిన పెట్రోలు ధరలు : మెట్రో నగరాల్లో గురువారం పెట్రోల లీటరుకు 16పైసల చొప్పున పెరిగాయి.. అయితే డీజిల్ ధరలు యథాతథంగా ఉన్నాయి. బ్రెట్ ఫూచర్స్ 0.3 శాతం పెరిగి బ్యారెల్‌కు 62.53 డాలర్లుగా ఉంది. అటు దేశీయ కరెన్సీ రూపాయి కూడా అమెరికా డాలర్‌తో పోలిస్తే 15 పైసలు క్షీణించి 72.24 ను తాకింది. రెండు నెలల కనిష్ట స్థాయి 72.09 వద్ద ముగిసింది. కాగా గత పదిరోజుల్లో పెట్రోలు ధరలు 85పైసలు పెరిగింది. బ్రెంట్ ముడి చమురు రేట్లు బ్యారెల్‌కు 62 డాలర్లకు మించడంతో, ప్రభుత్వ ఇంధన రిటైలర్లు గత 10 రోజులలో పెట్రోల్ ధరను 85 పైసలు పెంచగా, డీజిల్ ధర 4 పైసలు మాత్రమే పెరిగింది.
Comments
Post a Comment