గిరిజన గ్రామానికి మంచినీటి ట్యాంకు అందజేసిన పోలీసులు
సీలేరు /గూడెంకొత్తవీధి (జన హృదయం): గూడెంకొత్తవీధి మండలం గాలికొండ పంచాయతీ పాత్రునిగుంట గ్రామస్థులకు మంచినీటి ట్యాంకును గూడెంకొత్తవీధి సీఐ కె.మురళీధర్, సీలేరు ఎస్ఐ ఎ.నీలకంఠం అందజేశారు. మావోయిస్టు ప్రభావిత పంచాయతీ గాలికొండలో గూడెంకొత్తవీధి సీఐ మురళీధర్ ఆద్వర్యంలో పోలీసులు జనమైత్రి నిర్వహించారు. గాలికొండ పంచాయతీ పరిధిలో పాత్రునిగుంట, చిలకవీధి,బత్తునూరు, జాజిగొంది, బోడదేవుళ్లు గ్రామాల్లో నిర్వహించిన కార్యక్రమాల్లో సీఐ మురళీధర్ మాట్లాడుతూ మీకు ఎటువంటి సమస్యలు ఉన్న తమకు నేరుగా తెలియజేయవచ్చునని, జిల్లా ఎస్పీ మరియు చింతపల్లి ఎఎస్‌పీ ఆదేశాలు మేరకు మారుమూల గ్రామాల్లో పర్యటించి సమస్యలు తెలుసుకుంటున్నామని, అందులో భాగంగా గాలికొండ పంచాయతీలో పర్యటించామని, ఇందులో భాగంగా పాత్రునిగుంట గ్రామస్థులు కోరిక మేరకు వెయ్యి లీటర్లు సామర్థ్యం గల మంచినీటి ట్యాంకును సీఐ అందజేశారు. అదేవిధంగా పంచాయతీల్లో పలు గ్రామాలకు చెందిన యువకులకు వాలీబాల్ కిట్లును అందజేశారు.
Comments
Post a Comment