వసతి గృహాల్లో మౌలిక సదుపాయాలు

పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాసరావు.
భీమునిపట్నం  (జన హృదయం):  ప్రభుత్వ వసతి గృహ లలో మెరుగైన వసతులు కల్పిస్తామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజన సర్విసుల శాఖ మంత్రి ముత్తంశెట్టి.శ్రీనివాస రావు వెల్లడించారు. ఎస్.సి మరియు బి.సి వర్గాలు మా ప్రభుత్వానికి రెండు కళ్ళు లాంటివి. ఆణగారిన వర్గాల అభివృద్దికి ప్రభుత్వం కట్టుబడి ఉన్నది. భీమినిపట్నం పరిదిలో ప్రభుత్వ ఎస్.సి మరియు బి.సి వసతి గృహ లను ఆయన ఆకస్మికంగా సందర్శించారు. హాస్టల్ లో నీటి సమస్య, భోజన వసతి మరియు ఇతర మౌలిక సదుపాయాలను విద్యార్ధులను అడిగి తెలుసుకున్నారు. వీటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.  ఈ కార్యక్రమంలో మంత్రి అవంతి శ్రీనివాస రావు గారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహనరెడ్డి ఆదేశాలు మేరకు ప్రభుత్వ వసతి గృహంపై ప్రత్యెక దృష్టి పెట్టారని తెలిపారు. హాస్టలో ఉన్న మౌలిక సదుపాయాలు కానీ, మరమత్తులు కానీ, అన్నిటిపై ప్రత్యెక దృష్టి పెట్టారని, కావలసిన నిధులు కేటాయిస్తామని చెప్పారు. హాస్టల్లో పిల్లలకు పౌష్టిక ఆహరం కల్పించాలని అధికారులకు ఆదేశాలు వ్యక్తం చేసారు. నాణ్యమైన విద్యను అందించటమే ప్రభుత్వ లక్ష్యం అని తెలిపారు. బడుగు, బలహీన వర్గాల అభివృద్ది కోసం ప్రభుత్వ వసతి గృహాలలో అన్ని రకాల వసతులు కలిపిస్తు  దీనిని ప్రభుత్వం ప్రతీష్టత్మకంగా తీసుకు0దన్నారు. నాడు నేడు కార్యక్రమం ద్వారా ప్రతి పాటశాలలో అన్ని సదుపాయాలు కలిపిస్తు, దేశంలోనే విద్యా రంగంలో మొదటి స్థానంలోకి తెసుకురవటానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. ఈ యొక్క తనికిలోఅసిస్టెంట్ బిసి వెల్ఫేర్ అధికారి వసంతి కుమారి గారు ఎస్.సి మరియు బి.సి హాస్టల్స్ వార్డెన్స్,  ఎస్.సి. సెల్ నాయకులు  తదితరులు పాల్గొన్నారు.


Comments

Popular posts from this blog

కొత్త జిల్లాలను ప్రారంభించిన సీఎం జగన్‌

ఘనంగా ప్రారంభమైన అల్లూరి సీతారామరాజు జిల్లా