ప్లాష్ .... ప్లాష్.. దిశ నిందుతులు ఖతం....
దిశ ఘటనా స్థలంలోనే పోలీసు కాల్పులు... నిందుతులు మృతి...
హైదరాబాద్ (జనహృదయం) : పోలీసు ఎన్‌కౌంటర్‌లో వైద్యురాలు దిశ పై పాశవికంగా అత్యాచారానికి పాల్పడి బ్రతికుండగానే పెట్రోల్ పోసి అతి దారుణంగా హత్య చేసిన నలుగురు నిందితులను శుక్రవారం తెల్లవారు అదే సంఘటనా స్థలంలో పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. పరిస్థితులు అనుకూలించాయో, నిందితులు తిరుగుబాటో, పారిపోయే ప్రయత్నయో అని అలోచించే కంటే యావత్ భారతావని కోరిన విదంగా వారికి మరణ దండన ప్రాప్తించింది. అత్యంత దారుణంగా వ్యవహరించి అత్యాచారం హత్యాకాండకు పాల్పడిని నలుగురు యువకులను దిశను ఎక్కడైతే హత్య చేశారో అక్కడే పబ్లిక్‌గా ఉరితీయాలంటూ యావత్ భారతావని తీవ్రంగా ఆందోళన చేస్తూ గర్జిస్తోంది. పార్లమెంటును ఈ ఘటన కుదిపేసింది. రాజ్యసభలో చైర్మన్ వెంకయ్యనాడు ఏకంగా కంటతడి పెట్టుకుని తన భాదను వ్యక్తం చేశారు. ఇలా ఎందరో కన్న తల్లుల ఆవేదన గుండెకోత మిగిల్చి ఇటువంటి దారుణాలకు ఒడిగడుతున్న పాశవిక మానవ మృగాలను ఉరితీయాల్సిందేనని వారి కన్న తల్లులే తెగెసిచెప్పారు. ఇటువంటి తరుణంలో చట్ట ప్రకారం ప్రభుత్వం వ్యవహరించాల్సి ఉండగా వారిని అరెస్ట్ రిమాండ్, పోలీస్ కస్టడీ వంటి ప్రొసీజర్ ఫాలో అవుతున్న నేపధ్యంలో కేసును త్వరగా విచారించి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా పూర్తి చేసి నిందితులకు శిక్షపడే విదంగా చేసేందుకు ప్రభుత్వం చర్చలు తీసుకుంటోంది. ఈతరుణంలో శుక్రవారం తెల్లవారు దిశ సంఘటలో బాగంగా సీన్ రీక్రియేషన్ చేపడుతుండగా నిందితులు నలగురు పారిపోయేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అదే ప్రాంతంలో ఎన్‌కౌంటర్ చేశారు. కాకతాళీయమో , యాంత్రికంగానో జరిగిన ఈ ఘటనను దిశకు జరిగిన అన్యాయానికి ప్రజా ప్రతిఘటనగా పలువురు పేర్కొంటున్నారు. మారోసారి ఇటువంటి సంఘటనలు జరగకుండా నిందుతులకు సరైన గుణపాఠం చూకూరిందని సర్వత్రా వ్యక్తవమవుతూ తమ ఆందోళనను శాంతింపచేసుకుంటున్నారు.
Comments
Post a Comment