మద్యం లేకుండా చేయడమే లక్ష్యం.. ఏపి సిఎం జగన్‌...


అమరావతా (జనహృదయం): ఏపీలో మద్యపానం అనేదే లేకుండా చేయడమే తన లక్ష్యమని సీఎం జగన్‌ స్పష్టం చేశారు. సోమవారం అసెంబ్లీలో ఎక్సైజ్‌ చట్ట సవరణ బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంలో ఆయన మాట్లాడుతూ త్వరలోనే    ే పూర్తి స్థాయి మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తామని పేర్కొన్నారు.  ఇప్పటికే బెల్టు షాపులు ఎత్తివేశామని, ప్రభుత్వమే వైన్స్‌ షాపులు నిర్వహిస్తుందని తెలిపారు. బార్ల లైసెన్సులు కూడా రద్దు చేశామన్నారు.  మద్యపాన నిషేధం వల్ల చాలా కుటుంబాలు సంతోషంతో జీవిస్తున్నాయని సీఎం జగన్‌ ఆనందం వ్యక్తం చేశారు. కాగా రాష్ట్రంలో ఇంకా నాటు సారా దొరుకుతుందని, బెల్టు షాపులు కూడా నిర్వహిస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యేలు విమర్శించారు. దానికి ప్రతిగా సీఎం జగన్‌ స్పందించారు. ఎక్కడైనా వారి కంటికి కనిపిస్తే ఎందుకు సమాచారమివ్వలేదని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో చాలా కఠినంగా మద్య నియంత్రణ అమలు చేస్తున్నామన్నారు.


ఏపీ ఎక్సెజ్‌ చట్ట సవరణ బిల్ల్లును ఆమోదించిన అసెంబ్లీ...


ఏపీ ఎక్సైజ్‌ చట్ట సవరణ బిల్లును అసెంబ్లీ ఆమోదించింది. ఎక్సైజ్‌ శాఖ మంత్రి బిల్లును అసెంబ్లీలో ప్రవేశ పెట్టగా దీనిని మిగతా సభ్యులు ప్రతిపాదించారు.   ఎక్సైజ్‌ చట్ట సవరణ బిల్లులో మద్యం అక్రమంగా విక్రయించినా లేదా రవాణా చేసినా నాన్‌ బెయిలబుల్‌ కేసులు పెట్టాలని, మద్యం అక్రమంగా విక్రయిస్తూ లేదా రవాణా చేస్తూ పట్టుబడితే కనీసం 6 నెలల నుంచి 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష. విధించాలని, మొదటిసారి పట్టుబడితే రూ. 2 లక్షలు, రెండోసారి పట్టుబడితే రూ. 5 లక్షలు జరిమానా. వేసేందుకు నిర్ణయించారు. బార్లలో మద్యం ఆక్రమాలకు పాల్పడితే లైసెన్స్‌ ఫీజు కన్నా రెండు రెట్లు జరిమానా విధించి రెండోసారి తప్పు చేస్తే లైసెన్స్‌ రద్దు చేసేలా ఎక్సైజ్‌ చట్టంలో సవరణలు చేశారు. దీంతో ఇక మద్యం విచ్చలవిడిగా దొరికే అవకాశాలు ఉండవు. మద్య కొనుగోలు చేయాలన్నా అంతంతమాత్రమే మారిన చట్టంతో అక్రమ వ్యాపారాలకు చెక్‌పడనుంది.


Comments

Popular posts from this blog

కొత్త జిల్లాలను ప్రారంభించిన సీఎం జగన్‌

ఘనంగా ప్రారంభమైన అల్లూరి సీతారామరాజు జిల్లా