రోజు రైతుల సమస్యలపై అసెంబ్లీ ఎదుట టిడిపి ఆందోళన
అమరావతి (జనహృదయం): రాష్ట్రంలో నెలకొన్న రైతు సమస్యలపై ప్రభుత్వ తీరుకు నిరసనగా టిడిపి అసెంబ్లీ ఎదుట ఆందోళన చేపట్టింది. అసెంబ్లీ సమావేశాలు తొలిరోజు ఉల్లి ధరలపై నిరసన తెలిపిన టీడీపి రెండో రోజు రైతుల సమస్యలపై ఆందోళన చేసింది. అసెంబ్లీ దగ్గర టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వరికంకులు, పత్తిచెట్లతో నిరసన తెలిపారు. అసెంబ్లీ వరకు ర్యాలీగా వెళ్లిన చంద్రబాబు, టీడీపీ నేతలు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలు, గిట్టుబాటు ధరలపై టీడీపీ వాయిదా తీర్మానం కూడా ఇచ్చారు.
ఏపీలో రైతులు గిట్టుబాటు ధరలు లేక ఇబ్బందుల్లో అప్పుల్లో కూరుకుపోతున్నారని పంటల్ని కొనుగోలు చేసే నాథుడే కరువయ్యాడని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు రోడ్లపై ధాన్యం పోశారన్నారు. పామాయిల్, వేరుశెనగ రేటు కూడా తగ్గిపోయిందని, రైతు పంటకు గిట్టుబాటు ధర దేవుడెరుగు.. పంటల్న కొనే నాథుడే కరువయ్యారిని ఆందోళన చెందారు. దళారీ వ్యవస్థ రాజ్యమేలుతోందిని ప్రభుత్వ చేతగానితనమే దీనికి కారణమని ధ్వజమెత్తారు. ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేశామని, గిట్టుబాటు ధర కల్పిస్తామని కొత్త ప్రభుత్వం ప్రకటించినా పంటలు ఎందుకు కొనుగోలు చేయడం లేదని ప్రశ్నించారు.
కాగా అసెంబ్లీలో తొలిరోజు ఉల్లి ధరలపై చర్చకు పట్టుబట్టిన టీడీపీ నేడు రైతుల సమస్యపై చర్చకు పట్టుబట్టాలని టీడీపీ సిద్దమైంది. ఈ మేరకు వాయిదా తీర్మానం ప్రవేశపెట్టింది. రైతులు ఆర్ధిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్నారని వారిని ఆదుకునేందుకు ఈ అంశంపై చర్చ జరిపి తీరాల్సిందేనని ప్రతిపక్షం ఎమ్మేల్యేలు, ఎమ్మేల్సీలు చంద్రబాబు నాయకత్వంలో ద్వజమెత్తుతున్నారు.
Comments
Post a Comment