ఆన్లైన్ లాటరీకి కుటుంబం బలి....


తమిళనాడు:  ఓ కుటుంబం అన్లైన్ లాటరీ కి బలైంది. రాష్ట్రంలోని విల్లుపురంలో  సమీపంలోని సలామత్‌నగర్‌లో విషాద సంఘటన చోటు చేసుకుంది.  ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సభ్యుల స్వర్ణకార కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. ముగ్గురు కుమార్తెలకు విషమిచ్చి దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆన్‌లైన్ లాటరీకి ఈ కుటుంబం బలైపోయినట్లు స్థానికుల సమాచారం. ఆర్దిక ఇబ్బందులు నుండి గట్టేక్కేందుకు లాటరీ కట్టి చివరికి మోసపోయిన వారు తనువులు చాలించారు. ఈ మేరకు  ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


Comments

Popular posts from this blog

కొత్త జిల్లాలను ప్రారంభించిన సీఎం జగన్‌

ఘనంగా ప్రారంభమైన అల్లూరి సీతారామరాజు జిల్లా