మావోయిస్టు కార్యకలాపాలకు ఆలవాలమైన గూడెంలో తిరుగుబావుటా... ఎగరేసిన గిరిజనం...


అభివృద్దే ముద్దు... వారోత్సవాలోద్దు...


గూడెంకోతవీది  (జనహృదయం): వారోత్సవాలు వద్దు... అభివృద్దే ముద్దుంటూ గిరిజనం నినదించారు. శుక్రవారం గుచెంకొత్తveeథి మండల కేంద్రంలో విద్యార్థినీ విద్యార్థులతోపాటు వివిద గ్రామాల గిరిజనులు కధం తొక్కారు. తమ ప్రాంతాలు అభివృద్దికి ఆటంకం కావద్దంటూ నినాదాలు చేశారు. వారోత్సవాలతో ఒరిగేదేమీ లేదని అభివృదికి తోడ్పాటు అందించాలంటూ నినాదాలు చేశారు. మావోయిస్టులు అభివ ద్ధి నిరోధికులని గిరిజన పాంత అభివ ద్ధికి ఆటంకం కలిగిస్తున్నారని అరోపించారు. వారోత్సవాలు వద్దు, గిరిజనాభివ ద్దే ముద్దు అంటు మావోయిస్టులకు వ్యతిరేకంగా విద్యారులు, గ్రామ సులు, వివిధ సంఘాల నాయకులు,ఆటో జీపు యూనియన్‌ నాయకులు కలిసి మండల కేంద్రంలో శనివారం భారీ ర్యాలి చేసారు. గూడెం కోలనీ నుండి మండల కేంద్రం వరకు సాగిన ఈ ర్యాలీలో విద్యారులు మావోయిస్టు చర్యలకు వ్యతిరేకంగా నినాదాలు చేసారు. అనంతరం మండల కేంద్రంలో మాన వహారంగా ఏర్పడ్డారు. కొంతమంది విద్యార్థులు గిరిజన ప్రాంత అభివ ద్ధి గురించి మాట్లాడారు. ప్రజలకు ఉపయోగపడే ప్రభుత్వ ఆస్తులను వారోత్సవాల పేరుతో ధ్వంసం చెయ్యవద్దని హితవు పలికారు. గిరిజన ప్రాంత అభివ ద్ధిని ప్రతీ గిరిజనుడు కోరు కుంటున్నాడని గిరిజనుల అభివృద్ధికి ఆటంకం కలిగిస్తే గిరిజనుల  మద్దతు కోల్పోతారని హితవుపలికారు.


మారుమాల గ్రామాలలో రవాణా సదుపాయం కొరకు రోడ్లు వేసేందుకు ప్రభుత్వం ముందుకు వస్తే యంత్రాలను కాలుస్తూ మంచిపనిని మావో యిస్టులు అడ్డుకోవడం న్యాయం కాదని అభిప్రాయపడ్డారు. ఏజెన్సీలో సమాచార వ్యవస్థ మెరుగుపర్చేందుకు ఏర్పాటు చేసిన సెల్‌ టవర్లు కాల్చడం వల్ల మావోయిస్టులకు వచ్చిన లాభమేంటని ప్రశ్నిం చారు. గిరిజన ప్రాంతాల అభివ ద్ధి కాంక్షించాలే తప్ప జరుగు తున్న అభివ ద్ధిని అడ్డుకోవడం సరికాదన్నారు. ఇటువంటి చర్యల వల్ల గిరిజనుల నుండి వ్యతిరేకత కూడ గట్టుకుంటున్నారన్నారు. గిరిజన ప్రాంతం అభివ ద్ధి కోసం విద్యా, వైద్యం, త్రాగునీరు తదితర సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వానికి సహకరించాలని కోరారు.


Comments

Popular posts from this blog

కొత్త జిల్లాలను ప్రారంభించిన సీఎం జగన్‌

ఘనంగా ప్రారంభమైన అల్లూరి సీతారామరాజు జిల్లా