ఒకేరోజు 16 బిల్లులను ప్రవేశపెట్టడం ఒక చరిత్ర

పర్యాటక మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు (అవంతి శ్రీనివాస్)


అమరావతి : రాష్ట్ర శాసన సభ శీతాకాల సమావేశాలు ప్రశాంతంగా జరిగాయని ఒకే రోజు 16 బిల్లులను సభలో ప్రవేశపెట్టడం శాసన సభ చరిత్రలో ఒక రికార్డని రాష్ట్ర పర్యాటకశాఖా మాత్యులు ముత్తంశెట్టి శ్రీనివాస్(అవంతి శ్రీనివాస్)పేర్కొన్నారు.బుధవారం అమరావతి సచివాలయం నాల్గవ భవనంలోని ప్రచార విభాగంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి చెందేందుకు రాష్ట్ర సమగ్రాభివృద్ధే లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్ మెహన్ రెడ్డి నేతృత్వంలోని ఈ ప్రభుత్వం పనిచేస్తోందని స్పష్టం చేశారు. దిశ చట్టాన్ని తీసుకువచ్చినందుకు ప్రపంచమంతా కొనియాడుతుంటే సభలో ఈబిల్లు ప్రవేశపెట్టినపుడు ప్రతిపక్ష టిడిపి సభ నుండి  వాకౌట్ చేసిందని ప్రభుత్వం ఏ మంచి పనిచేసినా ప్రతిపక్షనేత చంద్రబాబుకు ఇష్టం ఉండడం లేదని ఆయన విమర్శించారు. అంతేగాక చంద్రబాబు మూడు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేశారని కాని ఇతరులు ముఖ్యమంత్రి అయితే సహించలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. 


అసెంబ్లీ శీతాకాల సమావేశాల చివరి రోజైన మంగళవారం శాసన సభలో రాజధానిపై చర్చ జరుగుతుంటే దానిని కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారని పైగా బయటికి వచ్చాక తుగ్లక్ పాలనగా ఈ ప్రభుత్వాన్ని విమర్శించడం ఎంతమాత్రం సమంజసం కాదని మంత్రి శ్రీనివాస్ పేర్కొన్నారు. రాజధానికి సంబంధించి గతంలో చంద్రబాబు చేసిన అవినీతి తారాస్థాయికి చేరడంతో కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వలేదని అన్నారు. చంద్రబాబు ఎప్పుడు కుళ్లు కుంతంత్రాలతో కూడిన రాజకీయం చేస్తుంటాడని నిజాయితీతో కూడిన రాజకీయం చేయడని కాని జగన్ అలాకాదని నీతివంతమైన, నిజాయితీతో కూడిన రాజకీయలకు ప్రతీకని చెప్పారు. నవరత్నాల హామీల్లో 80శాతం ఇప్పటికే అమలు చేసి మాట నిలబెట్టుకున్నారని తెలిపారు. అంతేకాదు మాటకు విశ్వాసానికి మారుపేరు జగన్ అని వంచన, నమ్మకద్రోహానికి మారుపేరు చంద్రబాబు అని విమర్శించారు. శాసనసభలో టిడిపి తరుపున 23 మంది ఎంఎల్ఏలు ఉంటే సగం మంది కూడా హాజరు కాలేదని ఇందుకు కారణం చంద్రబాబుపై వారు విశ్వాసాన్ని కోల్పోవడమేనని చంద్రబాబు ఇప్పటికే ప్రజా విశ్వాసాన్ని కోల్పోగా ఇప్పుడు వారి ఎంఎల్ఏల విశ్వాసాన్ని కూడా కోల్పోయినట్టుందని మంత్రి శ్రీనివాస్ ఎద్దేవా చేశారు.


 శాసన సభలో మంగళవారం రాజధానిపై జరిగిన చర్చలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు, ప్రజలు సమానంగా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో అమరావతిలో లెజిస్లేటివ్ రాజధాని, విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ రాజధాని, కర్నూల్లో జుడీషియల్ రాజధాని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారని మంత్రి శ్రీనివాస్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఏ ఆలోచన చేసినా చాలా ముందు చూపు దూరదృష్టితో చేస్తారని రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధిని దృష్టిలో ఉంచుకునే ఆయన ఈ నిర్ణయాన్ని స్పష్టంగా ప్రకటించారని దీనిపై ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని హితవు చేశారు. చంద్రబాబు తానా అంటే జనసేన అధినేత తందానా అంటాడని కావున అతని మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని మంత్రి కొట్టిపారేశారు. అంతేగాక చంద్రబాబు ఉచ్చులో పడిమోసపోవద్దని పవన్ కళ్యాణ్ కు ఆయన హితవు చేశారు. చంద్రబాబు అబద్దాలు చెప్పకుంటే బ్రతకలేడని అలాగే గంటా శ్రీనివాస్ అధికారం లేకుంటే బ్రతకలేడని మంత్రి శ్రీనివాస్ చెప్పారు. ఈ సమావేశంలో మంత్రితో పాటు పాయకారావుపేట ఎంఎల్ఏ జి.బాబూరావు పాల్గొన్నారు.


         
 -------------


Comments

Popular posts from this blog

కొత్త జిల్లాలను ప్రారంభించిన సీఎం జగన్‌

ఘనంగా ప్రారంభమైన అల్లూరి సీతారామరాజు జిల్లా