ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ప్రేమజంట ప్రియురాలు మృతి
విజయవాడ: ఓ ప్రేమ జంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటనలో యువతి మృతి చెందగా, ఆమె ప్రియుడు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. గుడివాడకు చెందిన లోకేష్, నాగ గౌతమి ఇద్దరు ప్రేమించుకుంటున్నారు. యువతి ఓ ప్రైవేటు కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తోంది. అయితే.. ఏమైందో ఏమో గానీ గాంధీనగర్‌లో ఉన్న జగపతి హోటల్‌లో నాలుగో ఫ్లోర్‌లోని 301 నంబరు గదిని అద్దెకు తీసుకొని.. ఇద్దరు విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వాళ్లు ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చి హోటల్ సిబ్బంది తలుపులు పగులగొట్టి చూడగా.. యువతి మృతి చెంది ఉంది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న లోకేష్ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కుటుంబ సభ్యులను, హోటల్ సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు.
Comments
Post a Comment