ప్లాష్‌... ప్లాష్‌.....కొనసాగుతున్న కూల్చివేత........విశాఖ ఏజన్సీలో ఆక్రమణల తొలగింపు చర్యతో ఆందోళన....


కూల్చివేతతో వేలాది రూపాయలు నష్టం....


రోడ్డున పడుతున్న చిరువ్యాపారులు...


సమయం ఇవ్వండంటూ ప్రాదేయపడుతున్న వైనం....


చింతపల్లి (జనహృదయం) : విశాఖ ఏజన్సీ చింతపల్లి రహదారికి ఇరువైపులా ఏర్పాటు చేసుకున్న చిరువ్యాపారుల దుకాణాలను ఆకస్మికంగా సోమవారం అధికార యంత్రాంగం తొలగించడంలో నిమగ్నమయింది. ఏజన్సీ చరిత్రలో తొలిసారి ఇటువంటి చర్యతో గిరిజన, గిరిజనేతరులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ ఘటన ఏజన్సీలో కలకలం రేపింది. ఈమేరకు వివరాలిలా ఉన్నాయి. చింతపల్లి రహదారికి ఇరువైపులా సుమారు కిలోమీటరు పరిదిలో చిన్న చిన్న వ్యాపారాల నిమిత్తం చెక్కలతో కూడిన బడ్డీలు, చిన్న చిన్న షెడ్లను ఏర్పాటు చేసుకొని జీవనోపాధి గడుపుతునన్నారు. వీటిలో గిరిజనులు గిరిజనేతరులు వ్యాపారాలను సాగిస్తుండగా గత కొంత కాలంగా అధికారులు వీటిని తొలగించాలని లేకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. బడ్డీలకు నోటీసులు కూడా అట్టించారు. వెంటనే తొలగించకపోతీ తామే కూల్చివేస్తామని అధికార యంత్రాంగం హెచ్చరించారు.



 అధికారులు ఇదే విదంగా హెచ్చరించినా తమ జీవనోపాధి దృష్ట్యా కొంత శాంతిస్తారులే అయినా తమవి పక్కా భవనాలు కాదుకదా అనే ధోరణిలో కొనసాగుతున్నారు. అయితే సోమవారం ఆకస్మికంగా తెల్లవారు జాము నుంచి అధికార యంత్రాంగం పోలసుల ఆధ్వర్యంలో  ఈ ఆక్రమణలను తొలగింపు కార్యక్రమం చేపట్టింది. ఏజన్సీలో ఎన్నడూ లేనివిదంగా ఈ తరహాలో అధికారులు కూలివేతకు సిద్దమవడంతో ఆంతర్యం ఏమిటో అంతుబట్టక సర్వత్రా నిరసనలు, ఆంధోళన వ్యక్తం అవుతున్నాయి. ఈ ఘటనతో బ్రతుకుదెరువుకోసం వేలాది రూపాయలు అప్పులు చేసి బడ్డీలు ఏర్పాటు చేసుకున్న చిరువ్యాపారుల బ్రతుకులు రోడ్డున పడ్డాయి. చేసిన అప్పులకు వడ్డీలు మాట ఎలా ఉన్నా అసలు కూడా తీర్చలేని పరిస్థితి ఎదురైంది. మరోవైపు తమ బ్రతుకులు ప్రశ్నార్థకంగా మిగిలాయని బోరున విలపిస్తున్నారు. కసీసం అధికారులు వారందరినీ పిలిచి మందలించి తీసివేయాయకపోతే కూల్చివేస్తామని గడువుకూడా ఇవ్వకపోవడం దారుణమని ఆందోళన చెందుతున్నారు. 



 అధికారులు అవలంభించిన తీరుకు నిరసనగా గిరిజన, గిరిజనేతర వ్యాపారులు ఆందోళన బాటపట్టారు. తెల్లవారునుంచి మొదలైన కూల్చివేత కార్యక్రమం కొనగాగుతుండడంతో వారి ఆవేదన వర్ణనాతీతంగా మారింది. అధికారులు ప్రజా ప్రతినిధులు స్పందించకపోవడంతో కనీసం కొంత సమయమైనా ఇవ్వకుండా కూల్చివేయడం దారుణమని ఆ వేదన చెందుతున్నారు. ఈమేరకు దశల వారీ ఆందోళనకు కార్యాచరన రూపొందిస్తున్నారు.


ఆదేశాలు పట్టించుకోకపోవడంతోనే .....


అక్రమ నిర్మాణాలను వెంటనే తీసివేయాలని అధికారులు కొంత సమయం ఇచ్చి నోటీసులు జారీచేసినప్పటికీ ఆదేశాలు భేఖాతరు చేయడంతో తామే వాటిని తొలగిస్తున్నామని అధికార యంత్రాంగం స్పష్టం చేస్తోంది. గత ఆరునెలలుగా ఈవ్యవహారం చాపకిందనీరులా సాగుతున్నప్పటికీ గత వారంలో చింతపల్లిలో పాడేరు సబ్‌ కలెక్టరు పర్యటించి ప్రభుత్వ స్థలాల్లో ఏర్పాటు చేసుకున్న ఆక్రమణలను తొలగించాలని హెచ్చరించారు. ఈమేరకు ఆదివారం సాయంత్రం వరకు గడువు విధించినట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో సోమవారం ఉదయానికి కూడా ఆక్రమణదారులు స్పందించకపోవడంతో ఈ పరిస్థితులు ఏర్పడ్డాయంటూ అదికారుల తెలిపారు.


Comments

Popular posts from this blog

కొత్త జిల్లాలను ప్రారంభించిన సీఎం జగన్‌

ఘనంగా ప్రారంభమైన అల్లూరి సీతారామరాజు జిల్లా