యువతి అదృశ్యం... జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు...


వరంగల్‌ (జనహృదయం): వరంగల్‌ లో యువతి అదృశ్యంమవడంతో కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. ఈమేరకు అక్కడి పోలీసులు జీరో ఎస్‌ఎఆర్‌ నమోదు చేశారు. ఈఘటనతో తెలంగాణా రాష్ట్రం వరంగల్‌ లోని సుబేదారి పోలీస్‌ స్టేషన్లో తొలి జీరో ఎస్‌ఎఆర్‌ నమోదైంది. శాయంపేట పరిధిలోని గోవిందాపూర్‌ కు చెందిన 24 సంవత్సరాల యువతి కనిపించడం లేదంటూ ఆమె చిన్నాన్న వరంగల్‌ లోని సుబేదారి పోలీస్‌ స్టేషన్‌లో శుక్రవారం సాయంత్రం నుంచి ఆమె కనిపించడం లేదని పోలీసులకు పిర్యాదు చేశారు. గోవిందాపూర్‌ అనేది శాయంపేట పోలీస్‌ స్టేషన్‌ పరిధికి చెందినది. అయితే, తాజాగా జీరో ఎచ్‌ఐఆర్‌ నమోదు చేయాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో సుబేదారి పోలీసులు తమ పోలీస్‌ స్టేషన్లో ఎస్‌ఎఆర్‌ నమోదు చేసి అనంతరం దాన్ని శాయంపేటకు బదిలీ చేశారు. యువతి కాల్‌ డేటా ఆధారంగా రెండు పోలీస్‌ స్టేషన్ల వారు కేసును విచారణ జరుపుతున్నారు. మరోవైపు తెలంగాణలో తొలి ఎఐఆర్‌ నమోదు చేసిన సుబేదారి పోలీసులను వరంగల్‌ సీపీ రవీందర్‌ అభినందించారు. ఇటీవల హైదరాబాద్‌ శివారులో వెటర్నరీ డాక్టర్‌ దిశ మిస్సింగ్‌ విషయంలో ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా, పోలీసులు తమ పరిధి కాదని, మరో పోలీస్‌ స్టేషన్‌ కు వెళ్లాలని చెప్పినట్టు ప్రచారం జరిగింది. ఈ క్రమంలో రాష్ట్రంలో ఎక్కడ అన్యాయం జరిగినా బాధితులు దగ్గరలో పోలీస్‌ స్టేషన్‌ కు వస్తే తొలుత ఎస్‌ఎఆర్‌ నమోదు చేయాలని, అనంతరం ఆ కేసును సంబంధిత స్టేషన్‌కు బదిలీ చేయాలని రాష్ట్ర డీజీపీ నుంచి ఆదేశాలు జారీచేశారు. ఈనేపథ్యంలో తొలి జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు కేసు దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది.


Comments

Popular posts from this blog

కొత్త జిల్లాలను ప్రారంభించిన సీఎం జగన్‌

ఘనంగా ప్రారంభమైన అల్లూరి సీతారామరాజు జిల్లా