పేదలందరికీ ఇళ్లు... ఉగాదికి 25లక్షల లబ్దిదారులు లక్ష్యంగా..
పేదలందరికీ ఇళ్లు మంజూరు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నవరత్నాల్లో కీలకమైన పేదలందరికీ ఇళ్ల పథకానికి సంబంధించి నిబందనలు సిద్దం చేశారు. పేదవాళ్లందరికి పట్టణాల్లో ఒక సెంటు భూమి ఇవ్వాలని, దీని ద్వారా ఎకరానికి 55 మందికి ఇళ్ల స్థలాలను కేటాయించవచ్చునని ప్రభుత్వం అంచనా వేస్తోంది. అంతేకాక జీ3 అపార్ట్‌మెంట్లను నిర్మించి అందరికి ఫ్లాట్లు ఇవ్వాలని చూస్తోంది. ఇకపోతే ఈ స్కీమ్‌కు అప్లై చేసుకోవాలనుకునేవారు.. తమ రేషన్ కార్డు జిరాక్స్‌ను కాపీ చూపాల్సి ఉంటుంది. రేషన్ కార్డు లేనివారు మీసేవ ద్వారా ఆదాయ ధ వీకరణ పత్రాన్ని దరఖాస్తు చేసుకోవచ్చునని సూచనలు తయారవుతున్నాయి. వచ్చే ఏడాది ఉగాది నాటికీ 25 లక్షల మంది పేదవాళ్లకు ఇళ్ల స్థలాలను ఇవ్వాలన్నది జగన్ సర్కార్ లక్ష్యం. దానికి అనుగుణంగా అధికారులు పక్కా ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు.
దీనిలో బాగంగా తహశీల్దారులు తమ ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న భూముల వివరాల్ని ప్రభుత్వానికి నివేదిస్తున్నారు. అక్రమాలకు తావు లేకుండా లబ్దిదారులకు స్థలాలను కేటాయించేటప్పుడు వారి ఆధార్ నంబర్, రేషన్ కార్డు వివరాల్ని లింక్ చేస్తారు. ఇక భూమి కేటాయింపు జరిగిన ఐదేళ్ల వరకు దాన్ని ఎవరికి అమ్ముకునే అవకాశం ఉండదు. . ఆ తర్వాత లబ్దిదారుడు నేరుగా ఎవరి ప్రమేయం లేకుండా ఎవరికైనా అమ్ముకోవచ్చునని తెలుస్తోంది. ఈ వ్యవహారం నిష్పక్షపాతంగా జరిపేందుకు స్థలాలు పొందిన లబ్ధిదారుల వివరాలను వార్డు, గ్రామ సచివాలయాల్లోను అందుబాటులో ఉంచనున్నారు.
Comments
Post a Comment