డిల్లీలో భారీ అగ్నిప్రమాదం.. 30మందికి పైగా మృతి..
ప్లాస్టిక్ గొడౌన్‌లో వ్యాపించిన మంటలతో ప్రమాదం...
డిల్లీ : ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం సంభవించి 30మందికి పైగా అగ్నికి ఆహుతయ్యారు. .డిల్లీలో అనాజ్ మండిలో చోటు చేసుకున్న ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 30 మంది మ తి చెందారు. అనాజ్ మండిలో ప్లాస్టిక్ తయారీ గొడౌన్ లో మంటలు వ్యాపించి విపరీతమైన పొగ, మంటలతో ఊపిరాడక 30మంది చనిపోయినట్లు సమాచారం. ప్రమాదం జరిగిన భవనంలో ప్లాస్టిక్ బ్యాగులు తయారు చేసినట్లు తెలుస్తోంది,. దీంతో ప్లాస్టికకు మంటలు అంటుకొని అగ్ని జ్వాలలు వ్యాప్తిచెందాయి. కాగా అగ్నిలో ప్లాస్టిక్ కాలిన వాసనతో (కార్భన్‌డైయాక్స్‌డ్) శాతం పెరిగిపోయి ఎక్కువ మంది ఊపిరాడక చనిపోయారిని స్థానికులు వాపోతున్నారు. ఈ సంఘటనలో మరో 50 మందికి గాయాలయ్యాయి వీరిని వైద్య సేవలకోసం యుద్దప్రాతిపదికన తరలిస్తూ మరోవైపు 30 ఫైరింజన్లు రంగంలోకి దింపి మంటల్ని అదుపు చేస్తున్నారు. అధికార యంత్రాంగం నిర్విరామంగా శ్రమిస్తున్నారు. అయితే ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
Comments
Post a Comment