తిరుపతిలో రౌడి షీటర్ దారుణ హత్య ....
తిరుపతి : తిరుపతి పట్నంలో రౌడీ షీటర్ బెల్టు మురళీ ధారుణ హత్యకు గురయ్యాడు. లీలామహల్ సమీపంలోని ఎస్ కే పాస్ట్ వద్ద. దుండగులు మొత్తం 8 మంది రోడ్డు పై మురళిని అతికిరాతకంగా నరికి హత్య చేసినట్టు స్థానికుల గుర్తించారు. దీంతో ఒక్కసారిగా స్థానిక ప్రజలు భయంతో పరుగులు తీశారు. ప్రత్యర్థులు బహిరంగంగా కిరాతకంగా అందరూ చూస్తుండగానే నరికి చంపడంతో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. కాగా హత్య కాబడిన వ్యక్తి పై తిరుపతి లో పలు స్టేషన్ లలో కేసులు ఉన్నాయి. ఒక మర్డర్ కేసులో ప్రదాన నిందితుడు. ప్రత్యర్థులే చంపి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఈమేరకు కేసు నమోదు చేసి నిందితుల కోసం తిరుపతిలో పోలీసుల వేట సాగిస్తున్నారు.
Comments
Post a Comment