గిరిజన విజ్ఞాన సంబరాల్లో అద్భుత ప్రతిభ...
ఆకట్టుకున్న గిరిజన విద్యార్థుల ప్రతిభ
పాడేరు (జనహృదయం) : గిరిజన విజ్ఞాన సంబరాల్లో విద్యార్థులు అద్భుతమైన ప్రతిభను ప్రదర్శించారని సమీక త గిరిజనాభి సంస్థ ప్రాజెక్టు అధికారి డికె బాలాజీ అన్నారు. స్థానిక తలారిసింగ్ కేంద్రీయాశ్రమోన్నత పాఠశాలలో మూడు రోజులుపాటు నిర్వహించనున్న గిరిజన విజ్ఞాన సంబరాలను సోమవారం ఆయన ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను వెలికి తీయడానికి విజ్ఞాన సంబరాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. గత ఏడాది నిర్వహించిన ప్రదర్శనలు చార్టులతో నిర్వహించగా ఉపాధ్యాయుల చొరవతో నేడు విద్యార్థులు నూతన ప్రయోగాలను ఆవిష్కరించారని అన్నారు. అంచనాలకు మించి వినూత్నంగా చేసిన ప్రయోగాలు, ప్రదర్శనలు ఆకట్టుకున్నాయని హర్షించారు. విద్యార్థుల్లో పోటీతత్వం పెంచానికి ఇటువంటి విజ్ఞాన సంబరాలు ప్రతి సంవత్సరం నిర్వహిస్తామన్నారు. ఉపాధ్యాయులను కుప్పం వశిష్ట ఫౌండేషన్‌కు విజ్ఞాన పర్యటనకు పంపించామన్నారు. గురువులు, విద్యార్థుల సామర్ధ్యాలు పెంచడానికి క షి చేస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయిలో విజ్ఞాన సంబరాలు నిర్వహించాల్సిన అవసరం ఉందని, ఆదిశగా క షి చేస్తామన్నారు. ఈ ఆవిష్కరణలు కోసం ఐటిడి ఏ నుంచి ఆర్ధిక సహకారం అందిస్తామని చెప్పారు. ముందుగా మండల స్థాయిలో నిర్వహించామన్నారు. తరగతి గదుల్లో నూతన ప్రయోగాలను విద్యార్థులకు బోధించాలని సూచించారు.
సబ్ కలెక్టర్ డా. వేంకటేశ్వర్ సలిజాముల మాట్లాడుతూ విద్యార్థుల ఆలోచనలు ఉన్నతంగా ఉండాలన్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులు సవాలుగా తీసుకోవాలన్నారు. ఉపాధ్యాయుల మార్గదర్శకంలో విద్యార్థినీ విద్యార్థులు అత్యుత్తమ ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టారన్నారు. గిరిజన విద్యార్థుల్లో అపారమైన ప్రతిభా పాటవాలున్నాయని అన్నారు. గిరిజన విజ్ఞాన సంబరాలు ప్రతీ ఏడాది నిర్వహించాలన్నారు. గిరిజన విద్యార్థుల సామర్ధాలను వెలికి తీయాలన్నారు. ఏజెన్సీలోని 109 పాఠశాల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. సామాన్య శాస్త్రంలో 16, బౌతిక శాస్త్రంలో 51,గణితంలో 63, ఆంగ్లంలో 52 ప్రదర్శనలు ఏర్పాటు చేసారు. జి.మాడుగుల బాలికలు-1 ఆశ్రమపాఠశాల విద్యార్థులు రోడ్డు భద్రత, కొత్తూరు ఆశ్రమ విద్యార్థులు స్మార్ట్ సిగ్నల్, జికె వీధి విద్యార్థులు హైడ్రాలిక్ ఫ్లై ఓవర్ వంతెన,ముంచింగ్ పుట్టు బాలికలు పవన్ శక్తి, కొయ్యూరు విద్యార్థులు గణితంలో సింపుల్ ధియోడలైట్, బ్యాంకు వడ్డీరేట్లు, ఉష్ణోగ్రతలు కొలతలు, సంభావ్యతపై చేసిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. విద్యార్థులు చేసిన న త్య ప్రదర్శనలు అలరించాయి. గిరిజన విజ్ఞాన సంబరాలు లోగోను, వాలీబాల్, కోకో క్రీడలను అతిధలు చేతుల మీదగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ ఉపసంచాలకులు జి.విజయ కుమార్, సహాయ గిరిజన సంక్షేమాధికారులు రజని, క్రాంతి, లక్ష్మి, ఉపాధ్యాయులు శ్రీనివాస పడాల్, రీమలి జాన్ , ఫిజికల్ డైరెక్టర్ సింహాచలం పలువురు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Post a Comment