కలెక్టర్, ఎస్పీలకు ఎపి సిఎం విందు...
అమరావతి : రాష్ట్రంలో 13 జిల్లాలకు చెందిన ఎస్పీ, కలెక్టర్‌లతో పాటు వైసీపి ఎమ్యేలేలకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి విందు ఏర్పాటు చేశారు. ఈమేరకు మంగళవారం రాజధానికి రావాల్సిందిగా జిల్లా అధికారులకు ఆహ్వానం పంపారు.
ఈ విందులో జిల్లాకో టేబుల్ చొప్పున 13 టేబుళ్లపై విందుకు ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాల వారీగా ఏర్పాటు చేసిన టేబుళ్ల వద్ద ఆయా జిల్లా అధికారులతో సిఎం జగన్ ఒక్కో టేబుల్ వద్ద 10 నిమిషాలపాటు అధికారులతో జిల్లా సంక్షేమం పాలన అంశాలపై మాట్లాడతూ వారికి ప్రోత్సాహం అందించనున్నారు. జిల్లాల పరిస్థితులు, సమస్యల గురించి అడిగి తెలుసుకుంటారని, వాటికి పరిష్కార మార్గాలపై సలహాలు అడుగుతారని తెలుస్తోంది. ఈ విందుకు జిల్లా అధికారులు కలెక్టర్, ఎస్పీ, పోలీస్ కమీషనర్‌లతో పాటు వైసీపీ ఎమ్మెల్యేలు కూడా హాజరవుతున్నారు. ఇక ఈ విందులో సంప్రదాయ ఆంధ్రా వంటకాలతో పాటు నార్త్, సౌతిండియన్ వంటలను వండి వడ్డిస్తారని సీఎంఓ కార్యాలయ వర్గాల బోగట్టా...
Comments
Post a Comment