70 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం కేసులో ... పదేళ్ల జైలు శిక్ష ...


అనంతపురంలో మహిళా కోర్టు తీర్పు


అనంతపురం : ఆరేళ్ల క్రితం 70ఏళ్ల వ ద్ధురాలిపై యువకుడు అత్యాచారం చేసిన కేసులోి పదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.10 వేలు జరిమానా విధిస్తూ అనంతపురం మహిళా కోర్టు తీర్పు ఇచ్చింది. జిల్లాలోని కంబదూరు మండలం అండేపల్లి గ్రామానికి చెందిన రాజు అనే యువకుడికి పదేళ్ల జైలు, రూ. పది వేలు జరిమానా విధిస్తూ అనంతపురం మహిళా కోర్టు జడ్జి బి.సునీత తీర్పు చెప్పారు. ఆరేళ్ల క్రితం 2013 ఆగష్టు 24 రాత్రి అదే గ్రామానికి చెందిన ఓ వ ద్ధురాలు ఇంట్లో నిద్రిస్తుండగా కుటుంబ సభ్యులు ఎవరు లేని సమయాన్ని అదునుగా చేసుకుని రాజు అనే యువకుడు ఆ వ ద్ధురాలిపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ అరుపులు వినిన ఇరుగు పొరుగు వారు పోలీసులకు సమాచారం చేరవేశారు. పోలీసులు వెంటనే స్పందించి ఆ వ ద్ధురాలిని చికిత్స నిమిత్తం అనంతపురం తరలించి మెరుగైన వైద్య సేవలు అందించారు. అప్పటి కళ్యాణదుర్గం సి.ఐ జి.రామక ష్ణయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అన్ని కోణాల్లో ఈ కేసును సమగ్రంగా విచారించిన అనంతపురం మహిళా కోర్టు న్యాయమూర్తి నిందితుడికి పది సంవత్సరాల జైలు శిక్ష, రూ. 10 వేలు జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. పక్కాగా దరాప్తు చేసిన సి.ఐ ను మరియు ప్రాసిక్యూషన్‌ తరుపున వాదించిన అడిషనల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ శ్రీదేవి, కోర్టు కానిస్టేబుల్‌ క ష్ణలను జిల్లా ఎస్పీ భూసారపు సత్య ఏసుబాబు అభినందించారు.


Comments

Popular posts from this blog

కొత్త జిల్లాలను ప్రారంభించిన సీఎం జగన్‌

ఘనంగా ప్రారంభమైన అల్లూరి సీతారామరాజు జిల్లా