తిరుపతిలో బాలికపై అత్యాచారం...మరో దారుణం...
ఇద్దరు నిందుతులు అరెస్ట్ చేసిన తిరుపతి రూరల్ పోలీసులు...
ఎక్కడికిపోతున్నాం... ఈ దుష్పరిణామాలు ఎటు దారితీస్తాయో... అర్థంకావడంలేదు... చట్టాలు ఎంత కఠినంగా ఉన్నా నిందుతులను ఎన్‌కౌంటర్ చేసినా మానవ మృగాలు తమకేమీపట్టనట్టు వ్యవహరిస్తూ కామవాంఛకోసం ఎంతటి ఘోరానికౌనా ఒడిగడుతూనే ఉన్నారు. మొన్న ఘాద్‌నగర్‌లో దిశ నిన్న విజయవాడలో ఓ బాలిక, నేడు తిరుపతిలో మరో అమ్మాయి ఇలా ఈ అత్యాచార ఘటనలకు అంతంలేదా? అని సమసమాజానికి తీరని వ్యథ కలిగిస్తోంది.
చిన్న పిల్లలను సైతం నరరూప రాక్షసులు వదలడం లేదు . కన్న వారికి కడుపుకోతలను మిగిలిస్తున్నారు. తాజాగా తిరుపతిలో మరో అత్యాచార ఘటన కలకలం రేపింది. తిరుపతికి సమీపంలో బాలికపై అత్యాచారం జరిగింది. తిరుపతి రూరల్ మండలం ముళ్లపూడి గ్రామానికి చెందిన ఓ బాలికకు లిఫ్ట్ ఇస్తామంటూ నమ్మించి ఇద్దరు యువకులు ఆమెను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. బాలికను బెదిరించి లైంగికదాడికి పాల్పడ్డారు. ఈ ఘటన ఈ రోజు వెలుగులోకి రావడంతో తిరుచానూరు పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో నిందితులు రాజమోహన్, వెంకటేశ్‌లను అరెస్టు చేశారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తీసుకెళ్లారు.
Comments
Post a Comment