తృటిలో తప్పిన పెను ప్రమాదం...
నక్కపల్లి (జనహృదయం) : రోడ్డు ప్రమాదంలో చిధ్రం అయిన ఆర్టీసీ బస్సు ముందుబాగం... విశాఖ జిల్లా నక్కపల్లి మండలం కాగిత టోల్ గేట్ వద్ద ఆదివారం జరిగిన ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. ఆర్టీసీ బస్సును లారీ ఢీకొన్న ఘటనలో పెద్ద ప్రమాదం తప్పింది. టెక్కలి నుండి రాజమండ్రి వెళ్తున్న ఆర్టీసీ డీలక్స్ బస్సు టోల్ ప్లాజా వద్దకు రాగానే టోల్ ఫీజు చెల్లించేందుకు బస్సును డ్రైవరు నెమ్మదిగా నడుపుతున్నాడు. ఇదే సమయంలో వెనక నుండి వచ్చిన ట్రాలర్ చివరి భాగం బస్సు ఎక్కే డోర్ కు తగలడంతో బస్సు క్యాబిన్ సగం మేర ఊడిపోయింది. ఈ ప్రమాద సమయంలో బస్సులో 32 మంది ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అద ష్టవశాత్తు చిన్న చిన్న గాయాలు తో సురక్షితంగా బయట పడ్డారు.
Comments
Post a Comment