రాకెట్ పరీక్ష విజయవంతం
న్యూఢిల్లీ: భారత ఆర్మీ కోసం డీఆర్‌డీవో సరికొత్తగా అభివృద్ధి చేసిన పినాక గైడెడ్ రాకెట్ పరీక్ష విజయవంతమైంది. ఇటీవల అప్‌గ్రేడ్ చేసిన ఈ క్షిపణిని గురువారం ఒడిసా తీరంలోని చాందిపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి పరీక్షించారు. పినాక శత్రు భూభాగంలోకి 75 కిలోమీటర్ల పరిధి వరకు ప్రవేశించి లక్ష్యాలను ఛేదించగలదు. భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ కొన్ని ఇతర సంస్థల సహకారంతో దీనిని అభివృద్ధి చేసింది.
Comments
Post a Comment