ఎపికి మణిహారం కానున్న విశాఖపట్నం...
విశాఖపట్నం : ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల స్వప్నం సిం జగన్ ప్రకటన ఈ దిశగా ఆశక్తి కలిగిస్తోంది. సిం ప్రకటన వెలువడకముందే ఈమేరకు రాజధానికి ముందస్తు కసరత్తు చేసారు. భూములు, భవనాలపై ఎప్పటినుంచో ఏర్పాట్లు ఓ కొలిక్కి చేరాయి. రుషికొండ కేంద్రంగా పాలనకు సన్నాహాలు చేస్తుండగా సీఎం క్యాంపు కార్యాలయంగా మిలీనియం టవర్‌ను సెలెక్ట్ చేసారు. పాలనలో బాగంగా 4 ఎకరాల్లో 10 అంతస్థులతో 145 కోట్లతో నిర్మాణానికి ఏర్పాటుకు రంగం సిద్దమయింది. ప్రభుత్వ కార్యాలయాల కోసం 80 కోట్లతో టవర్-2 ఏర్పాటు కోసం మూడు నెలల క్రితమే స్టార్టప్ విలేజ్‌లో కంపెనీలు ఖాళీ చేయించారు. కాగా సాగర నగరంలో రాజధాని ఆలోచనకు చాలాకాలం క్రితమే బీజం పడిందని తెలుస్తోంది. అందుకు అవసరమైన భూములు, భవంతులకు సంబంధించిన పూర్తి సమాచారం జిల్లా యంత్రాంగం నుంచి ప్రభుత్వానికి ఎప్పుడో చేరింది. అయితే రాజధాని కోసమని చెప్పకుండా 'బిల్డ్ ఏపీ' పేరుతో కొంత, గృహ నిర్మాణానికి భూముల పేరిట మరికొంత సమాచారం సేకరించారు.
అసెంబ్లీ సమావేశాల చివరిరోజున విశాఖలో కార్య నిర్వాహక రాజధాని పెట్టాలనే ఆలోచన ఉందని సీఎం జగన్ చెప్పడం, దానికి తగినట్టుగానే జీఎన్ రావు కమిటీ నివేదిక ఉండటంతో అందుబాటులో ఉన్న భవంతులు, భూముల గుర్తింపు ప్రక్రియ మరింత వేగవంతమైంది. ఇప్పటి వరకూ ఎక్కడెక్కడ, ఏమేం గుర్తించారన్న దానిపై ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.
విశాఖపట్నం-భీమిలి బీచ్‌రోడ్డులో ఉన్న రుషికొండ ఐటీ పార్కులో గత ప్రభుత్వం నిర్మించిన మిలీనియం టవర్‌ను సీఎం క్యాంపు కార్యాలయంగా ఉపయోగించుకుంటారని చెబుతున్నారు. ఈ భవనాన్ని నాలుగు ఎకరాల విస్తీర్ణంలో రూ.145కోట్లతో నిర్మించారు. పది అంతస్థులతో, అధునాతన సౌకర్యాలతో కూడిన ఈ భవనంలో 2లక్షల చదరపు అడుగుల నిర్మాణ స్థలం ఉంది. దీనితోపాటు మరో 1.5లక్షల చ.అ. పార్కింగ్ సదుపాయం ఉంది. ఐటీ సంస్థల కోసం నిర్మించిన ఈ భవనాన్ని సీఎం క్యాంపు కార్యాలయం పెడతారని వార్తలొస్తున్నాయి.. దీన్ని మిలీనియం టవర్-1 గా వ్యవహరిస్తున్నారు.
Comments
Post a Comment