అరకు రైల్యేస్టేషన్‌లో ప్రయాదం... కార్మికుడు మృతి...


అరకులోయ (జనహృదయం) : అరకులోయ రైల్వేస్టేషన్లో విద్యుత్‌ షాక్‌తో ఒకరు మృతిచెందగా మరొకరి పరిస్థితి ఆందోళనగా ఉంది. స్టేషన్‌లో లోడింగ్‌ చేస్తుండగా విద్యుత్‌ వైర్లు తగిలి ఇద్దరు కార్మికులు కింద పడిపోయారు. కోరాపుట్‌ జిల్లా కి చెందిన 23 మంది కాంక్రీట్‌ స్వీపర్‌ కార్మికులు గూడ్స్‌ బోగీల్లో సరుకు లోడ్‌ చేస్తుండగా విద్యుత్‌ ఘాతనికి గురై ఇద్దరు కార్మికులు గురయ్యారు. వీరిలో కోరాపుట్‌ జిల్లా, రామగిరి గ్రామానికి చెందిన పాంగి భోయిదే (25) అక్కడి కక్కడే మ తి చెందాడు. భోయి పరిగుడ గ్రామానికి చెందన కిళ్లో ఉద్యో పరిస్థితి విషమంగా ఉండటంతో అరకు కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌ కి తరిలించి చికిత్స అందిస్తున్నారు. విద్యుత్‌ సరఫరా నిలుపుదల చేయకుండా పనులు చేయడంతో ప్రమాదం జరిగినట్టు కార్మికులు ఆందోళన చెందుతున్నారు. ఈమేరకు అధికారులు వివరాలు సేకరిస్తున్నారు.


Comments

Popular posts from this blog

కొత్త జిల్లాలను ప్రారంభించిన సీఎం జగన్‌

ఘనంగా ప్రారంభమైన అల్లూరి సీతారామరాజు జిల్లా