ఉల్లి కోసం ఎగబడ్డ జనం
శ్రీకాకుళం : నరసన్నపేట: స్థానిక మార్కెట్ కమిటీ కార్యాలయం వద్ద ఉల్లి విక్రయాలు కొనసాగుతున్నాయి బుధవారం ఉదయం నుంచే మేజర్ గ్రామ పంచాయతీ తో పాటు పరిసర గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున చేరుకున్నారు ఉదయము ఒక్కసారిగా మహిళలు రావడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. గత మూడు రోజులుగా పోలీస్ పహారా లో ఉల్లి పంపిణీ సజావుగా సాగింది. ప్రారంభ సమయంలో చిన్న సైజుతో పాటు నాణ్యతలేని ఉల్లి రావడంతో స్థానికులు పెద్దగా ఆసక్తి కనబర్చలేదు. బుధవారం నుంచి పెద్ద సైజులో ఉల్లి రావడంతో స్థానికులు అధిక సంఖ్యలో కార్యాలయం వద్దకు చేరుకున్నారు. క్యూలైన్లలో ఉన్న మహిళలు మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది దీంతో ఒకరినొకరు తిట్టుకొంటూ సిబ్బందిపై పడటంతో ఎస్ ఐ వి. సత్యనారాయణ పర్యవేక్షణలో, పోలీస్ సిబ్బంది రెండు లైన్లు ఏర్పాటు చేసి వినియోగదారులకు బందోబస్తు మధ్య ఉల్లి పంపిణీ చేశారు.
Comments
Post a Comment