అమరావతే ఎపి రాజధాని...మంత్రి బొత్సా....
అమరావతి : ప్రభుత్వం మారిన నేపథ్యంలో అమరావతి రాజధానిని తరలిస్తారన్న ఉహాగానాలు, స్వయాన పట్టణాభివృద్ది శాఖ మంత్రి బోత్స వ్యాఖ్యల నేపథ్యంలో రాష్ట్ర రాజధాని కొనసాగింపుపై సర్వత్రా ఆంధోళన నెలకొన్న విషయమై శాసన మండలిలో స్పష్టమైన ప్రకటన శువ్రారం వెలువడింది. అన్న వర్గాలు ఈ విషయంలో ఆందోళన చెందుతున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కొంతకాలం క్రితం అమరావతికి ఇప్పటికే చాలా నిదులిచ్చాం మరోచోట రాజధానికి నిధులివ్వలేమని పేర్కొనడం, భారత మేప్‌లో ఎపి రాజధానిని తొలుత గుర్తించకపోవడం మళ్లీ దానిపై రాజ్యసభలో చర్చకు రావడంతో భారత పటంలో అమరావతిని రాజధానిగా గుర్తుంచడం జరిగింది. అయినప్పటికీ వైసీపి ప్రభుత్వం ఇప్పటి వరకు ఈ విషయంలో క్లారిటీ ఇవ్వకపోవడం కొంత మేర అయోమయ పరిస్థితి నెలకొంది. దీనికి తోడు అమరావతిని బ్రతికించాలని చంద్రబాబు అమరావతి పర్యటన చేయడం జరిగింది.
శాసన మండలిలో ప్రకటించిన మంత్రి బొత్సా...
ఈ నేపథ్యంలో ఏపీ రాజధాని పై ఏపీ సర్కార్ క్లారిటీ ఇచ్చింది. ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగుతుందని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. శాసన మండలిలో చర్చ జరుగుతున్న సందర్భంలో టిడిపి సభ్యురాలు శమంతక మణి అడిగిన ప్రశ్నకు మంత్రి బొత్స సత్యనారాయణ సమాధానమిచ్చారు. ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగుతుందని దీనిలో ఎటువంటి ఆందోళన అవసరం లేదని ఆయన రాత పూర్వకంగా సమాధానమిచ్చారు. దీంతో గత కొంత కాలంగా కొనసాగుతున్న సస్పెన్స్ కు తెరపడింది. దీని పై రాజధాని రైతులు హర్షం వ్యక్తం చేశారు. గతంలో కూడా బొత్స రాజధాని పై ప్రకటనలు చేశారు. అయితే ఇటీవల జరిగిన సమావేశాల్లో రాజధాని ప్రాంంతంలో పెండింగ్ పనులన్నింటిని వెంటనే పూర్తి చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఇదే సమయంలో మంత్రి బొత్స శాసనమండలిలో ప్రకటన చేయడంతో రాజధాని అమరావతే అని స్పష్టమైతుంది. ఇది ప్రభుత్వం అధికారికంగా చెప్పిన ప్రకటనగానే భావించవచ్చని పలువురు చర్చించుకుంటున్నారు. అయితే ఇటీవల రాజధాని పెండింగ్ పనులు కూడా ఊపందుకున్నాయి. అమరావతే రాజధాని అని తేలడంతో అన్ని వర్గాల్లోను హర్షం వ్యక్తమవుతోంది.
Comments
Post a Comment