ఆందోళన కలిగించిన నాటు తుపాకులు
హైదరాబాదు: నాంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో నాటు తుపాకులు లభ్యమైన ఘటన ఆందోళన కలిగించింది. ఇక్కడి సులభ్ కాంప్లెక్సులో రెండు నాటు తుపాకులు కనిపించడంతో నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ రెండు తుపాకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్టేషన్ కు వచ్చిన ఎవరైనా సులభ్ కాంప్లెక్సులో తుపాకులను దాచి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
Comments
Post a Comment