బాలికపై అత్యాచారం...ఏపిలో మరోదారుణం


తల్లితో సహా యువకుడుని అరెస్ట్‌ చేసిన పోలీసులు....


విజయవాడ (జనహృదయం): మహిళా రక్షణకై చట్టాలెన్ని వచ్చినా.. ఎన్ని ఎన్‌కౌంటర్‌లు జరిగినా మాకేం భయం అంటూ మానవ మృగాలు రెచ్చిపోతున్నాయి. దిశ అత్యాచారం, సజీవదహనం కేసులో నిందితులు ఎన్‌కౌంటర్‌లో మృతి చెంది 32 గంటలు వ్యవధిలో ఏపిలో మరో దారుణం చోటుచేసుకొని ఓ యువతి అత్యాచారానికి గురైన విషయం కలిచివేస్తోంది.  గ్యాంగ్‌ రేప్‌ నిందితుల్ని ఎన్‌కౌంటర్‌ చేసి అలాంటి నేరాలకు పాల్పడిన వారికి కఠిన శిక్షలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నా.. అవేం పట్టుకుండా కొందరు మానవ మృగాలు తమ పని తాము చేసుకుపోతున్నారు. తాజాగా ఏపీలో బాలికపై అత్యాచారానికి పాల్డడ్డాడు ఓ కామాంధుడు. పుట్టినరోజు వేడుకల పేరుతో బాలికను ఇంటికి పిలిచి ఓ యువకుడు ఈ దారుణానికి పథకం పన్నాడు. ఈ అత్యాచారానికి అతడి తల్లి కూడా సహకరించడంతో యువకుడితోపాటు అతని తల్లిని కూడా పోలీసులు అరెస్ట్‌ చేశారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. విజయవాడ భవానిపురంలో ఈ దుర్ఘటన జరిగింది. దిశ నిందితుల ఎన్‌ కౌంటర్‌ తరువాత ఈ ఘటన జరగడం సంచలనం స ష్టించింది.


శిక్షలు పడుతున్నా మానవ మృగాల్లో మాత్రం మార్పు రావడం లేదు. దిశ ఘటనలో నలుగురిని ఎన్‌కౌంటరర్‌ చేయడంతో కొంతకాలమైనా ఇటువంటి దురాగతాలకు పులిస్టాప్‌ పడుతుందని అంతా భావించారు. అయితే ఎన్‌కౌంటర్‌ జరిగి నలుగురు మృతి చెందినంత మాత్రాన ఈ అఘాయిత్యాల పర్వం ఆగుతుందని భావిస్తున్నారా? వీటికి అంత మెప్పుడు? పరిష్కారం ఏవిదంగా ఉండాలో ప్రతిఒక్కరూ ఆలోచించాల్సిన తరుణం ఆసన్నమైంది. మానవ మృగాలను ఏంచేస్తే ఈదారుణాలకు తెరపడుతుందో? మేల్కొని ఆలోచించాల్సిన బాధ్యత యువతకే ఎరుక.... మహిళా లోకం ఏవిదంగా తమను తాము కాపాడుకోవాలో బయటికి వెళ్లే ఆడవారు జాగ్రత్త పడాల్సిందే మరి... అలాగే ఎవరినీ నమ్మి మోసపోకుండా జాగ్రత్త పడాలి... నమ్మితేనే మోసం సులువుగా మోసం చేయగలుగుతారు... ఈ విషాయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తెరగాలి ఇకనైనా....


Comments

Popular posts from this blog

కొత్త జిల్లాలను ప్రారంభించిన సీఎం జగన్‌

ఘనంగా ప్రారంభమైన అల్లూరి సీతారామరాజు జిల్లా