ఎన్‌కౌంటర్‌ పై త్రిసభ్యకమీషన్‌ ఏర్పాటు.... సుప్రీం ఆదేశం...


న్యూడిల్లీ : అధ్యంంతం ఉత్కంఠభరితంగా సాగుతున్న దిశపై అత్యాచారం, హత్యకు పాల్పడిన నిందితులు పోలీసుల ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన ఘటన దేశవ్యాప్తంగా పెల్లుభికిన ప్రజాగ్రహాన్ని శాంతింపచేసి, పోలీసులను జైజై ద్వానాలతో ఆకాశానికెత్తిన వ్యహారం పూర్తి విచారణకు మరో ఆరునెలల గడువు విధిస్తూ తిస్రభ్య కమీషన్‌ నియమిస్తూ సుంప్రీంకోర్టు ఈ కేసును వారికి అప్పగించింది. అయితే నిందితుల అంత్యక్రియల విషయం తేల్చలేదు. కాగా విచారణ తేది కమీషన్‌ చైర్మన్‌ ప్రకటిస్తారని కమీషన్‌ సభ్యులకు విచారణ దిశగా అన్ని ఏర్పాట్లు చేయాలని తెలంగాణా ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశంచింది. నిష్పకక్షపాతంగా కేసువిచారణ జరిగి న్యాయం అందించేందుకే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు సుప్రీం పేర్కొంది.


ముగిసిన సుప్రీం విచారణ...


గురువారం ఈ కేసులో నిందితుల తరపు న్యాయవాదులు, తెలంగాణా ప్రభుత్వం తరపు న్యాయవాదుల వాదనలుపై సుప్రీం కోర్టులో గురువారం విచారణ ముగిసింది. న్యాయవిచారణకు సుప్రీం కోర్టు ముగ్గురు సభ్యులతో కమిషన్‌ ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్‌ 6 నెలల్లో విచారణ ముగించి నివేదిక ఇవ్వాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. మాజీ న్యాయమూర్తి వీఎస్‌ సిర్పుర్కార్‌ కమిషన్‌ కు చైర్మన్‌ గా వ్యవహరించనున్నారు. ముంబాయి హైకోర్టు మాజీ న్యాయమూర్తి రేఖ, సీబీఐ మాజీ డైరెక్టర్‌ కార్తికేయన్‌ సభ్యులుగా వ్యవహరిస్తారు. కమిషన్‌ కు అయ్యే ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని సుప్రీం తెలిపింది. కమిషన్‌ కు సీఆర్పీఎఫ్‌ భద్రతను కల్పించాలని కూడా సుప్రీం ఆదేశించింది. విచారణ ప్రారంభమైన అనంతరం అసలు ఈ పిటిషన్‌ ఎందుకు వేశారని పిటిషనర్‌ జీఎస్‌ మణిని ప్రధాన న్యాయమూర్తి ప్రశ్నించారు. ఎన్‌ కౌంటర్‌ పై వాస్తవాలు తెలుసుకోవాలనుకుంటున్నానని, ఇది బూటకపు ఎన్‌ కౌంటర్‌ లా ఉందని పిటిషనర్‌ అన్నారు. అసలు అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటున్నానని పిటిషనర్‌ వివరించారు. తెలంగాణ ప్రభుత్వం తరపున లాయర్‌ ముకుల్‌ రోహత్‌వాదనలు వినిపించారు. నిందితులు తుపాకితో ఫైర్‌ చేసిన తర్వాతనే పోలీసులు కాల్పులు జరిపారని రోహత్‌ వాదించారు. నిందితులు ఫైర్‌ చేసినప్పుడు బుల్లెట్లు పోలీసులకు తగలలేదని తెలిపారు. దీంతో న్యాయవిచారణకు కమిషన్‌ ను ఏర్పాటు చేస్తున్నామని ప్రధాన న్యాయమూర్తి స్పష్టం చేస్తూ విచారణ ముగించారు.


Comments

Popular posts from this blog

కొత్త జిల్లాలను ప్రారంభించిన సీఎం జగన్‌

ఘనంగా ప్రారంభమైన అల్లూరి సీతారామరాజు జిల్లా