ఆదాయానికి మించిన ఆస్తులు
అమరావతి : ట్రాన్స్‌కో విజిలెన్స్ అదనపు ఎస్పీ హరికృష్ణ ఆస్తులపై అనిశా అధికారులు సోదాలు నిర్వహించారు. ఆదాయానాకి మించి ఆస్తులున్నాయనే ఆరోపణలతో ఏకకాలంలో 6చోట్ల దాడులు నిర్వహించారు. ఈమేరకు వివరాలను అనిశా డిఎస్పీ రమణమూర్తి వెల్లడించారు. ఇప్పటి వరకు రూ.2 కోట్లకుపైగా విలువైన ఆస్తుల్ని గుర్తించినట్లు చెప్పారు. పీఎంపాలెం, పరదేశీపాలెంలో హరికృష్ణ గతేడాది ఆస్తులు కొన్నారని చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో హరికృష్ణ భార్య పేరిట ఓ లాకర్‌ను గుర్తించామన్నారు. భార్య బ్యాంకు ఖాతాలో రూ.16 లక్షలు ఉన్నట్లు చెప్పారు. హరికృష్ణ ఎస్‌ఐ హోదా నుంచి అదనపు ఎస్పీ స్థాయికి ఎదిగారని చెప్పారు.
Comments
Post a Comment