కేరళ సెమి హై స్పీడ్ రైల్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్
కేరళ:- కేరళలో సెమీ హైస్పీడ్ రైలు ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అనుమతి తెలిపింది. తిరువనంతపురం నుంచి కసర్‌గడ్ వరకు చేపట్టనున్న సిల్వర్ లైన్‌కు కేంద్రం అనుమతి తెలిపింది. ప్రాజెక్టు కార్యరూపం దాల్చితే రెండు ప్రాంతాల మధ్య ప్రయాణ సమయం 12 గంటల నుంచి 4 గంటలకు తగ్గనుంది. కేరళ రైల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టనుంది. డబుల్ లైన్‌గా చేపట్టే ఈ మార్గంపై గంటకు 200 కిలోమీటర్ల వేగంతో రైళ్లు పరుగులు తీయనున్నాయి. అధ్యయనం బఅందం ప్రాజెక్ట్ నివేదిక అనంతరం కేరళ రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి పంపించింది. 532 కిలోమీటర్ల ప్రయాణ మార్గంగా ఉన్న ఈ ప్రాజెక్ట్‌ను పర్యావరణహిత ప్రాజెక్ట్‌గా పట్టాలకు ఎక్కించనున్నట్లు కేరళ రాష్ట్ర సిఎం పినరయి విజయన్ తెలిపారు. ఈ రైలు కారిడార్ అయిదు లక్షల మందికి ఉపాధి కల్పించనున్నట్లు చెప్పారు. ప్రాజెక్ట్ పూర్తితో తక్షణమే 11 వేల మంది ఉద్యోగావకాశాలు పొందుతారని తెలిపారు. ఈ సెమీ హైస్పీడ్ రైలు ప్రాజెక్టు రూ.66,079 వేల కోట్ల వ్యయంతో నిర్మాణ పనులు జరుగుతున్నాయి.
Comments
Post a Comment