పోలీసు బూట్లను ముద్దాడిన ఎంపీ
అనంతపురం: పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డిపై హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ మండిపడ్డారు. శుక్రవారం తన నివాసంలో మాట్లాడిన ఆయన.. జేసీ వ్యాఖ్యలను ఖండించారు. ఆయన మాటలకు కౌంటర్‌గా.. అమర పోలీసు బూటును మాధవ్ ముద్దాడారు. దేశ రక్షణకు పోలీసులు ప్రాణాలు అర్పిస్తున్నారని.. అలాంటి పోలీసులపై జేసీ దివాకర్‌రెడ్డి జుగుప్సాకరంగా మాట్లాడరని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో పోలీసులపై వ్యాఖ్యలు చేస్తే జేసీని ప్రజలు బజారుకీడ్చారని.. రాజకీయ సమాధి కట్టారన్నారు. జేసీ మాట్లాడుతుంటే దుర్యోధనుడిలా టీడీపీ అధినేత చంద్రబాబు నవ్వారని విమర్శించారు.
Comments
Post a Comment