రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి
కూలిపనికి వెళ్తున్న వారి ద్విచక్ర వాహనం దారుణ ప్రమాద
(ముగ్గురు మృతి ఒకరి పరిస్థితి విషమం)
అనకాపల్లి (జన హృదయం) : యలమంచిలి -అనకాపల్లి జాతీయరహదారిపై కశింకోట మండలం గొబ్బూరు జాతీయరహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం ప్రమాదం జరిగింది. సోమవారం ఉదయం కూలి పనుల నిమిత్తం కశింకోట మండలం గొబ్బూరు జాతీయ రహదారిపై హీరోహోండా గ్లామర్ ద్విచక్ర వాహనంపై వెళ్తున్న నలుగురు యువకులను ట్రాక్టర్ ఢీ కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు యువకులు మృ తి చెందగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.మృతులు ఉరుటి నాగేశ్వరరావు, నమ్మి సతీష్,నమ్మి నాగ అప్పారావులుగా గుర్తించారు.అయితే వీరు నలుగురు విశాఖపట్నం జిల్లా బుచ్చెయ్యపేట మండలం ఆర్.శివరాంపురం చెందిన వారుగా పోలీసులు గుర్తించారు.వీరిలో నమ్మి దేవుళ్లు అనే యువకుడిని కొన ఊపిరితో ఉండటం గుర్తించిన స్థానికులు అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రికి హుటాహుటిన తరలించారు. వీరంతా కూలిపని నిమిత్తం మునగపాక మండలం యాదగిరిపాలెం వెళుతుండగా ఈ ఘటన జరిగింది.ట్రాక్టర్ రాంగ్ రూట్ లో రావడం కూడా ప్రమాదానానికి కారణంగా పోలీసులు భావిస్తున్నారు.
Comments
Post a Comment