ఎన్కౌంటర్ పై సిట్ ఏర్పాటుచేసిన తెలంగాణా సర్కార్ ...


పోలీసులను కలవరపెడుతున్న దిశ ఎన్కౌంటర్ ....


హైదరాబాద్‌ (జనహృదయం) : దిశ ఘటనలో ఎన్‌కౌంటర్‌ పోలీసులను కలవరపెడుతోంది. దిశపై అత్యాచారం, సజీవదహనం కేసులో నిందుతులు పోలీస్‌ ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన విషయంలో దేశవ్యాప్తంగా సంచలనమై జయహో తెలంగాణా పోలీస్‌ అంటూ యావత్‌ భారతావని ఆకాశానికెత్తింది. డిసెంబరు ఆరున జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌పై మునుపెన్నడూ లెనంద ప్రజాదరణ పొందిందనడంలో సందేహం లేదు. కాని డిసెంబర్‌ ఏడు నుంచి దిశఘటనలో నిందితుల ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసుల చుట్టూ ఉచ్చు బిగుస్తుండడం వారిని తీవ్ర కలవరానికి గురుచేస్తేంది. ఒక్కొక్కటిగా పోలీసులకు వ్యతిరేకంగా అడుగులు పడుతున్యాయి. అయితే ఇవన్నీ చట్టంలో బాగమే అయినప్పటికీ ఆత్మరక్షణలో బాగంగా పోలీసులు చేసిన ఈ ఎన్‌కౌంటర్‌పై చట్టానికి సమాదానం చెప్పాల్సిందే. ఎన్‌ కౌంటర్‌ ఏదైనా చేసేది పోలీసులే. చేసేవరకు బాగానే ఉంటుంది. ఆ తర్వాతే వారికి టార్చర్‌ కనిపిస్తుంది. మానవ హక్కలు సంఘాల నేతల కేసులు, కోర్టులో విచారణ ఇలా వారికి నరకమే. కేసు తెలేే వరకు వాళ్లు కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉండాలి. తాజాగా దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసుల పరిస్థితి ఇదే తరహాలో నడుస్తోంది. వాస్తవానికి ఏదైనా క్రైం జరిగిన వెంటనే నిందితులను కఠినంగా శిక్షించాలని, నడిరోడ్డుపై కాల్చి చంపాలని భావోద్వేగంతో జనం ఆగ్రహంతో ఊగిపోతారు. కాని వారికోపం చల్లారిన తరువాత ఏదైనా సందర్భంలో ఎన్‌ కౌంటర్లు జరిగితే వారినుంచే మానవ హక్కులు ఉల్లంగన కేసులకు తెరలేస్తుంది. దీనిలో బాగంగా జాతీయ మానవహక్కుల కమీషన్‌ సుమోటాగా కేసు నమోదు చేసి ఈ ఘటనప దర్యాప్తు చేస్తోంది. సుప్రీంకోర్టులో పోలీసులకు వ్యతిరేకంగా పిటీషన్‌ దాఖలైంది.


నిందితుల ఎన్‌కౌంటర్‌ పై సిట్‌ ఏర్పాటు చేసిన సర్కార్‌...


నవంబర్‌ 27న జరిగిన దిశ హత్యాచారం ఘటన కేసుకు సంబంధించి విచారణ కోసం నలుగురు నిందితులను పోలీసులు సీన్‌ రీ కన్‌ స్ట్రక్షన్‌ కోసం విచారించేందుకు దిశను సజీవదహనం చేసిన ప్రదేశానికి తీసుకుని వెళ్లారు. అక్కడ నిందితులు పోలీసుల వద్ద ఉన్న తుపాకులను లాక్కొని వారి మీద రాళ్లతో దాడి చేశారు. దీంతో పోలీసులు ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో నలుగురు నిందితులు అక్కడికక్కడే చనిపోయారు. ఈనేపథ్యంలో ఎన్‌ కౌంటర్‌ పై కొందరు అనుమానాలు వ్యక్తం చేయడం, గత రెండు రోజులగా జాతీయ మానవహక్కుల కమీషన్‌ దర్యాప్తు చేపడుతున్న సందర్భంలో దిశ నిందితుల ఎన్‌ కౌంటర్‌ పై తెలంగాణ ప్రభుత్వం సిట్‌ ను ఏర్పాటు చేసింది. ఈ ఎన్‌కౌంటర్‌ వ్యవహరంపై ప్రత్యేక దర్యాప్తు బ ందం విచారణకు టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఆదేశించింది. ఈమేరకు రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌ నేత త్వంలో ఏడుగురు సభ్యులలో సిట్‌ ఏర్పాటైంది. దీనిలో వనపర్తి ఎస్పీ అపూర్వ రావు, మంచిర్యాల డీసీపీ ఉదయ్‌ కుమార్‌ రెడ్డి, రాచకొండ ఎస్‌ఓటీ డీసీపీ సురేందర్‌, సంగారెడ్డి డీఎస్పీ శ్రీధర్‌, రాచకొండ ఐటీ సెల్‌ శ్రీధర్‌ రెడ్డి, కోరుట్ల సీఐ రాజశేఖర్‌ రాజు, సంగారెడ్డి డీసీఆర్‌బీ సీఐ వేణుగోపాల్‌ రెడ్డి సభ్యులుగా నియమించింది. కాగా ఎన్‌ కౌంటర్‌ పై ప్రభుత్వం సిట్‌ ఏర్పాటు చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. మద్దతునిస్తున్న సోషల్‌ మీడియా.. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెలంగాణ పోలీసులకు విపరీతమైన మద్దతు లభిస్తుండగా, దిశ నిందితులను ఎన్‌కౌంటర్‌ చేసిన తర్వాత పోలీసులపై కేసులేసిన వారిని దుమ్ము దులుపుతున్నారు. దిశకు అన్యాయం జరిగినప్పుడు మీరంతా ఎక్కడున్నారని ప్రశ్నిస్తూ, ఇప్పటికైనా వారంతా కళ్ళు తెరవాలన్న ఆగ్రహం జనంలో వ్యక్తం అవుతోంది.


Comments

Popular posts from this blog

కొత్త జిల్లాలను ప్రారంభించిన సీఎం జగన్‌

ఘనంగా ప్రారంభమైన అల్లూరి సీతారామరాజు జిల్లా