లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్ ఐ


చిత్తూరు : సత్యవేడు మండలం శ్రీసిటీ ఎస్‌ఐ సుబ్బారెడ్డి లక్ష రూపాయల లంచాన్ని తీసుకుంటూ.. ఎసిబికి రెడ్‌ హ్యాండెడ్‌ గా పట్టుబడ్డాడు. బుధవారం అవినీతి నిరోధక శాఖ సిఐ విజయ్‌ శేఖర్‌ ఆధ్వర్యంలో ఎసిబి బృందం వల పన్ని శ్రీసిటీ ఎస్సై సుబ్బారెడ్డిని రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
శ్రీ సిటీ ఎస్సై సుబ్బారెడ్డి ముఖ్యంగా పలు కేసుల్లోనూ, ఇసుక మాఫియాలోను తెరచాటున వ్యవహారాలు జరుపుకుంటూ లంచం తీసుకుంటున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు ఈరోజు దాడులు జరిపి ఎస్‌ఐ సుబ్బారెడ్డి ని పట్టుకోగలిగారు. ప్రస్తుతం ఎస్‌ఐ సుబ్బారెడ్డిని నెల్లూరు జిల్లా సులూరుపేటలో విచారిస్తున్నారు.


Comments

Popular posts from this blog

కొత్త జిల్లాలను ప్రారంభించిన సీఎం జగన్‌

ఘనంగా ప్రారంభమైన అల్లూరి సీతారామరాజు జిల్లా