ప్రారంభమైన భవానీ దీక్షల విరమణ
విజయవాడ:- ప్రముఖ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షల విరమణ ప్రారంభమైంది. బుధవారం ఉదయం దుర్గగుడి ఈవో సురేష్‌బాబు దీక్షల విరమణను ప్రారంభించారు. ఐదు రోజుల పాటు భవానీ దీక్షల విరమణ ప్రక్రియ జరుగనుంది. దీక్షల విరమణ నేపథ్యంలో నేటి నుంచి 26 వరకు ఆలయంలో అన్ని ఆర్జిత సేవలు రద్దు చేశారు. మరోవైపు ఇంద్రకీలాద్రిపై ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్‌పై నిషేధం విధించినట్లు ఈవో సురేష్‌బాబు వెల్లడించారు.
Comments
Post a Comment