నాగపూర్ మేయర్ పై కాల్పులు...

ముంబయి: నాగ్‌పూర్ మేయర్ సందీష్ జోషిపై ఇద్దరు దుండగులు కాల్పులు జరపి పారిపోయిన సంఘటన వార్ధా రోడ్డులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. గత రాత్రి జోషి తన 24వ వివాహ వార్సికోత్సవ వేడుకలను తన స్నేహితులతో కలిసి ఔటర్ రింగ్ రోడ్డులో గల ఓ ధాబాలో చేసుకొని కారులో ఇంటికి వెళ్తుండగా వార్ధా రోడ్డులోని ఓ సిగ్నల్ వద్ద సందీప్‌పై కాల్పులు జరిపారు. ఇద్దరు వ్యక్తులు బైక్‌లపై వచ్చి కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది. మూడు బుల్లెట్లు కారు అద్దాలకు తగలడంతో ప్రాణపాయం నుంచి మేయర్ తప్పించుకున్నాడు. కారులో మేయర్‌తో పాటు అదిత్య టాకూర్ కూడా ఉన్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని నిందితులను పట్టుకుంటామని ఎస్‌పి రాకేశ్ ఓలా తెలిపాడు...


Comments

Popular posts from this blog

కొత్త జిల్లాలను ప్రారంభించిన సీఎం జగన్‌

ఘనంగా ప్రారంభమైన అల్లూరి సీతారామరాజు జిల్లా