షార్టుసర్య్కూట్ తో టూరిస్ట్ కారు దగ్ధం
చింతపల్లి( జనహృదయం) : షా ర్టుసర్య్కూట్ కు గురై ఓటూరిస్ట్ కారు దగ్ధమైంది. ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. మంగళవారం రాత్రి జరిగిన సంఘటనలు సంబంధించిన వివ రాలు ఇలా ఉన్నాయి. రాజమండ్రికి చెందిన కొంత మంది పర్యాటకులు లంబసింగిని తిలకించేందుకు వచ్చారు. రాత్రి లంబసింగి ఘాట్ రోడ్డు ఎక్కుతుండగా కారులో సాంకేతిక లోపం తలెత్తి పొగలు వచ్చాయి. ఇది గమనించిన డ్రైవర్ వెంటనే కారును రహదారి పక్కన నిలుపి అందరు దిగి బయటకు వచ్చేశారు. దీంతో ప్రాణ నష్టం తప్పింది. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా దగ్దమైంది.
Comments
Post a Comment