బలిమెల ముంపుబాధితులను ఆదోకోండి...

 



లేకుంటే తమను ఆంద్రాలో విలీనం చేయండి... ఆదివాశీల ఆందోళన


సీలేరు (జనహృదయం) : బలిమెల జలాశయంలో తమ గ్రామాలు కనుమరుగైపోతున్నాయంటూ ఆంద్రా-ఒడిశా సరిహద్దుల్లో గిరిజనులు భారీ ర్యాలీ నిర్వహించారు. బలిమెల జలాశయం వల్ల తమ గ్రామాలు ముంపునకు గురై, పంటపొలాలు నాశనమై తమకు తినడానికి తిండి కూడా లేకుండా పోయిందని ఆరోపిస్తూ ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లా పరిధిలోని అయిదు పంచాయతీలకు చెందిన గిరిజనులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఒడిశాలోని జాన్‌బై గురుప్రియ వంతెన కు ఆవల ఉన్న పనసపుట్టు అటవీప్రాంతంలో బుధవారం ఉదయం విశాఖ ఆదివాసీ దళం ఆధ్వర్యంలో ఈ ర్యాలీ నిర్వహించారు. గత కొన్నేళ్లుగా బలిమెల జలాశయం నీటివల్ల తమ మనుగడ ఇబ్బందికరంగా మారిందని, దీనిపై ఒడిశా అధికారులకు ఎన్ని సార్లు విన్నవించినప్పటికీ వారి నుంచి ఫలితం లేకుండా పోయిందని, గత మూడు నెలలుగా తమ సమస్యలు మీద మల్కన్‌గిరి జిల్లా కలెక్టర్‌ నుంచి ఒడిశా ముఖ్యమంత్రి వరకు వినతిపత్రాలు పంపించినా ఎటువంటి స్పందన లేదని, పంటపొలాలు ముంపునకు గురికావడం వల్ల నోటి వరకు వచ్చిన కూడు కొట్టుకుపోయినట్లయిందని వారు వాపోయారు. ఒడిశా ప్రభుత్వం తాము ఎదుర్కొంటున్న 31 సమస్యలపై తక్షణమే స్పందించి పరిష్కారానికి చొరవచూపాలని, ఒడిశా ప్రభుత్వానికి చేతకాకపోతే తమ గ్రామాల్ని ఆంద్రా ప్రభుత్వంలో విలీనం చేయాలని, లేదంటే తామే స్వతంత్య్రంగా ఆంధ్రాలోకి వెళ్లిపోతామని ఈ సందర్భంగా హెచ్చరించారు. పనసపుట్‌ అటవీప్రాంతంలో సుమారు రెండు కిలోమీటర్లు మేరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం బలిమెల ముంపు బాధితులకు ఆంధ్రా ప్రభుత్వం ఉదారంగా అందచేసిన నిత్యవసర సరుకులను గిరిజనులకు విశాఖ ఆదివాసీ దళం సబ్యులు పంపిణీచేశారు. ఈ ర్యాలీలో బలిమెల జలాశయం వల్ల తమ గ్రామాలు ముంపునకు గురై పంటపొలాలు నాశనం అవుతున్నాయని, ఆండ్రాపల్లి, పనసపుట్టు, జోడాం, జంత్రి, గద్దలమామిడి పంచాయతీలకు చెందిన గిరిజనులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు.


Comments

Popular posts from this blog

కొత్త జిల్లాలను ప్రారంభించిన సీఎం జగన్‌

ఘనంగా ప్రారంభమైన అల్లూరి సీతారామరాజు జిల్లా