దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై అనుమానాలు... సుప్రీంకోర్టు


ఎన్‌కౌంటర్‌ మృతులదేహల అంత్యక్రియలకు బ్రేక్‌...


రిటైర్డ్‌ న్యాయమూర్తితో విచారణకు రంగం సిద్దం....


దర్యాప్తుకోసం న్యామూర్తి పేరును ఎంపిక చేసి పంపాలని రాష్ట్రానికి ఆధేశం...


న్యూడిల్లీ : దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టు కీలకవ్యాఖ్యలు చేసింది. నిందితుల ఎన్‌కౌంటర్‌ చట్టవ్యతిరేకంగా జరిగిందంటూ సుప్రీంకోర్టులో వేసిన పిటీషన్‌పై బుధవారం విచారణ జరిగింది. ఈ ఘటనలో తమకు ఎన్నో అనుమానాలున్నాయని సుప్రీంకోర్టు ప్రధాన న్యామమూర్తి జస్టిస్‌ ఎన్‌ ఎ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అంతేకాకుండా ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు రిటైర్ట్‌ న్యాయమూర్తి ఆధ్వర్యంలో దర్యాప్తు చేసే దిశగా పరిశీలిస్తామని కోర్టు పేర్కొంది. ఈ ఎన్‌కౌంటర్‌పై పూర్తి సమాచారం తమ వద్ద ఉందని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన వారి మృతదేహాల అంత్యక్రియల విషయం తేల్చలేదు. గురువారం నాటికి కేసును వాయిదా వేసింది.


ఈ వ్యవహారంపై జ్యుడీషియల్‌ విచారణకు ప్రతిపాదిస్తూ ఈ మేరకు సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి నేత త్వంలో సిట్‌ను ఏర్పాటు చేయాలని సూచించింది. ఇందుకోసం విశ్రాంత సుప్రీంకోర్టు న్యాయమూర్తి పేరును రాష్ట్రమే ఎంపిక చేసి తమను సంప్రదించాలని రాష్ట్రాన్ని ఆదేశించింది.


Comments

Popular posts from this blog

కొత్త జిల్లాలను ప్రారంభించిన సీఎం జగన్‌

ఘనంగా ప్రారంభమైన అల్లూరి సీతారామరాజు జిల్లా