నల్లమట్టి ఇసుకపై పెట్టిన ఆంక్షలను ఎత్తివేయాలి....
ట్రాక్టర్ ఓనర్స్ డ్రైవర్ల యూనియన్ డిమాండ్....
ఇబ్బంది లేకుండా చూస్తామన్న వైసిపి ఇన్‌చార్జ్ శ్రీనివాస్
పశ్చిమ గోదావరి జిల్లా: నల్లమట్టిపై మైనింగ్ విధానాన్ని రద్దు చేయాలంటూ... రాష్ట్ర ప్రభుత్వం నల్లమట్టి ఇసుకపై పెట్టిన ఆంక్షలను ఎత్తివేయాలని దీనివల్ల రైతులు తీవ్ర ఇబ్బందిపడుతున్నారని పాలకొల్లు నియోజవర్గ ట్రాక్టర్ ఓనర్స్ డ్రైవర్ల యూనియన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు బుధవారం ఉదయం పాలకొల్లు గాంధీ బొమ్మ సెంటర్ వద్ద పాలకొల్లు నియోజవర్గ ట్రాక్టర్ ఓనర్స్ డ్రైవర్ల యూనియన్ ధర్నా నిర్వహించింది. ధర్నా అనంతరం డిసిసిబి చైర్మన్ పాలకొల్లు నియోజకవర్గ వైసిపి ఇన్‌చార్జ్ శ్రీనివాస్ కు వినతిపత్రాన్ని సమర్పించారు.
ఈ సందర్భంగా ట్రాక్టర్ యాజమాన్యాల సంఘం అధ్యక్షులు చెరుకూరి అంజిబాబు మాట్లాడుతూ... రైతులు తమ పొలాలు మెరక అవుతాయనే ఉద్దేశంతో మట్టిని ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లేందుకు అనుమతిస్తారని తెలిపారు. దీనికి మైనింగ్ రెవెన్యూ అనుమతులు తీసుకోవాలని జీవో విడుదల చేయడం దారుణమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కొత్తగా ప్రతి ట్రాక్టర్ కు జిపిఎస్ సిస్టమ్ ఉండాలనే ఆంక్షలు పెట్టడంతో ట్రాక్టర్ డ్రైవర్ లకు పనిలేకుండా పోయిందని ఆవేదన చెందారు. ఈ విధానాన్ని రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ట్రాక్టర్ యూనియన్‌వారి సమస్యను విన్న వైసిపి ఇన్‌చార్జ్ శ్రీనివాస్ స్పందిస్తూ.. రెవెన్యూ అధికారులతో మాట్లాడి ఇబ్బంది లేకుండా చూస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ట్రాక్టర్ యాజమాన్యాల సంఘం అధ్యక్షులు చెరుకూరి అంజిబాబు, రావూరి రాజా, దాసిరెడ్డి శ్రీనివాస్ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment