సిద్దిపేట జిల్లా అడిషనల్ ఇంట్లో ఎసిబి సోదాలు ఐదు కోట్ల ఆస్తులు గుర్తింపు

నర్సింహారెడ్డికి సంబంధించి రూ.5 కోట్ల విలువైన ఆస్తులు గుర్తింపు


హైదరాబాద్‌ :  సిద్దిపేట అదనపు ఎస్పీ నర్సింహారెడ్డి ఇంట్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు బుధవారం సోదాలు చేశారు. ఈ రోజు ఉదయం నుంచి కొనసాగుతోన్న ఈ సోదాల్లో ఇప్పటివరకు నర్సింహారెడ్డికి సంబంధించి రూ.5 కోట్ల విలువైన ఆస్తులను అధికారులు గుర్తించారు. హైదరాబాద్‌, సిద్దిపేట, మహబూబ్‌ నగర్‌, కామారెడ్డి లోని నర్సింహారెడ్డి నివాసాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. నర్సింహారెడ్డి బంధువుల ఇళ్లల్లోనూ సోదాలు కొనసాగుతున్నాయి. నర్సింహారెడ్డికి సంబంధించి బ్యాంక్‌ లాకర్‌, హైదరాబాద్‌ లోని విల్లా, ఇంటి స్థలాలను అధికారులు గుర్తించారు. సిద్దిపేట వన్‌టౌన్‌ కానిస్టేబుల్‌ సాంబారెడ్డి ఇంట్లో కూడా సోదాలు కొనసాగుతున్నాయి.


Comments

Popular posts from this blog

కొత్త జిల్లాలను ప్రారంభించిన సీఎం జగన్‌

ఘనంగా ప్రారంభమైన అల్లూరి సీతారామరాజు జిల్లా